- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
వరుస మూడు రోజుల నష్టాల నుంచి కోలుకున్న సూచీలు గురువారం మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. అంతకుముందు వరుస మూడు రోజుల నష్టాల నుంచి కోలుకున్న సూచీలు గురువారం మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా బాండ్ల రాబడి పెరగడం వల్ల ఇతర దేశాల ఈక్విటీలపై ప్రభావం చూపడం, వీటికి తోడు ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న కొవిడ్-19 కేసులు, దేశీయంగా కీలక రిలయన్స్, ఫైనాన్స్, ఐటీ షేర్లలో అమ్మకాలు అధిక నష్టాలకు కారణమయ్యాయి. ఓ దశలో వెయ్యికి పైగా పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ ఇండెక్స్, ఆఖర్లో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 644.64 పాయింట్లు క్షీణించి 80,952 వద్ద, నిఫ్టీ 203.75 పాయింట్లు కోల్పోయి 24,610 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఆల్ట్రా సిమెంట్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, రిలయన్స్, ఎన్‌టీపీసీ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.97 వద్ద ఉంది.






