- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vodafone Idea: ఏఐ ద్వారా స్కామ్‌లకు అడ్డుకట్ట: వొడాఫోన్ ఐడియా
ఏఐ ఆధారిత వాయిస్ స్పామ్ డిటెక్షన్ సిస్టమ్, సైబర్ డిఫెన్స్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అనే పరిష్కారాలు ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా స్పామ్, స్కామ్ కాల్స్, మోసపూరిత మేసేజ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులను స్కామ్‌ల నుంచి రక్షించేందుకు 'వీఐ ప్రొటెక్ట్' పేరుతో సరికొత్త ఏఐ-ఆధారిత సొల్యూషన్‌ను ప్రారంభించింది. ఇందులో ఏఐ ఆధారిత వాయిస్ స్పామ్ డిటెక్షన్ సిస్టమ్, సైబర్ డిఫెన్స్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అనే రెండు కీలకమైన పరిష్కారాలు ఉన్నాయి. ఇవి వినియోగదారులకు రియల్-టైమ్‌లో రక్షణ అందిస్తాయి. అంతేకాకుండా వీఐ నెట్‌వర్క్, వ్యాపార కార్యకలాపాలను సైబర్ దాడుల నుంచి రక్షిస్తుంది. వీఐ వాయిస్ స్పామ్ డిటెక్షన్ వ్యవస్థ కస్టమర్ల ఫీడ్‌బ్యాక్, వెబ్ క్రాలర్, ఏఐ మోడళ్లను ఉపయోగించి స్కామ్, స్పామ్ కాల్స్‌ను గుర్తిస్తుంది. ఏవైనా అనుమానాస్పద నంబర్ నుంచి కాల్ వచ్చిన సమయంలో స్క్రీన్‌పై సస్పెక్టెడ్ స్పామ్ వార్నింగ్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ పూర్తిగా వీఐ నెట్‌వర్క్ పరిధిలో ఉంటుంది. ఇది మోసపూరిత మెసేజ్‌లను కూడా గుర్తిస్తుంది. అంతర్జాతీయ కాల్స్ కోసం ఇంటర్నేషనల్ కాలింగ్ అని డిస్‌ప్లే చూపిస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ నంబర్ల నుంచి జరిగే మోసాలను గుర్తించవచ్చు. ఇక, సైబర్ డిఫెన్స్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఏజెంటిక్, జనరేటివ్ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించి సైబర్ మోసాలు, బెదిరింపులను గుర్తించి, నిలువరిస్తుంది.






