Vivo Y400: వివో నుంచి మరో సరికొత్త ఫోన్.. 6000mAh బ్యాటరీ, ధర ఎంతంటే

by velandi.Saikiran |

ఇండియన్ మార్కెట్లో వివో కంపెనీకి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. వందలో కనీసం 40 శాతం మంది ఈ మొబైల్ కంపెనీకి

Vivo Y400: వివో నుంచి మరో సరికొత్త ఫోన్.. 6000mAh బ్యాటరీ, ధర ఎంతంటే
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లో వివో కంపెనీకి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. వందలో కనీసం 40 శాతం మంది ఈ మొబైల్ కంపెనీకి సంబంధించిన.. ఫోన్స్ వాడుతున్నారు. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా... వివో రకరకాల మొబైల్స్ రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వివో y 400 ( Vivo Y400 5G mobile) పేరుతో మరో కొత్త ఫోన్ తీసుకువచ్చింది.

ఇందులో 6000 mah బ్యాటరీ సామర్థ్యం, అలాగే 50 ఎంపీ ప్రధాన కెమెరా కూడా ఉంటుంది. అంతేకాదు 6.67 అంగుళాల డిస్ప్లే కూడా అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ os 15 తో ఈ మొబైల్ ఫోన్ పనిచేస్తుంది. సెల్ఫీల కోసం 32 MP కెమెరా కూడా ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ ఫోన్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

వివో వై 400 5జి మొబైల్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8gb +128gb మోడల్ మొబైల్ ధర 22,000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. 8gb +256gb మోడల్ మొబైల్ ధర 24 వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. గ్లామ్ వైట్, ఆలివ్ గ్రీన్ కలర్స్ లో మాత్రమే ఈ ఫోన్స్ లభిస్తాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి ఈ మొబైల్ ఫోన్స్ రిటైల్ షాపులలో కూడా కొనుగోలు చేయవచ్చు.

Next Story