- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vivo Y39 5G: వివో నుంచి క్రేజీ ఫోన్... 6,500mAh బ్యాటరీ..ధర ఎంతంటే ?

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే తక్కువ ధరలో చాలా రకాల మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం 5జి ఫోన్ల ట్రెండు కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఓ అదిరిపోయే మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది. వివో నుంచి Vivo Y39 పేరుతో 5జి మొబైల్ విడుదలైంది. గతంలో వివో నుంచి రిలీజ్ అయిన ఫోన్ల కంటే ఈ మొబైల్ చాలా భిన్నంగా ఉంటుందని కంపెనీ ప్రకటన చేసింది.
Vivo y39 ప్రత్యేకతలు
ఈ Vivo Y39 5G మొబైల్ ఫోన్ 6.68 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది. 120 HZ రిఫ్రిష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ వివో 5జి ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 50 MP సోనీ హెచ్ డి ప్రైమరీ కెమెరాతో పాటుగా 2 Mp కెమెరా ఉంటుంది. ముఖ్యంగా సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. డ్యూయల్ వ్యూ వీడియో సదుపాయం కూడా అందిస్తున్నారు. ఈ మొబైల్ ప్రారంభ ధర 16,99 నుంచి ఉంటుంది. Vivo Y39 5G మొబైల్ ఫోన్ సామర్థ్యం 6,500mAh.
ధర విశేషాలు
Vivo Y39 5జి మొబైల్ 8gb ram + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ 16,999 రూపాయలు ఉంటుంది. అలాగే...8gb ram + 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ 18,999 రూపాయలు ఉంటుంది. లోటస్ పర్పుల్, ఓషన్ బ్లూ కలర్స్ లో Vivo Y39 5G లభిస్తుంది.






