Vivo T4R 5G: వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర ఎంతంటే

by velandi.Saikiran |

మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మార్కెట్లోకి.. వివో నుంచి మరో సరికొత్త మొబైల్

Vivo T4R 5G: వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర ఎంతంటే
X

దిశ, వెబ్ డెస్క్ : మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మార్కెట్లోకి.. వివో నుంచి మరో సరికొత్త మొబైల్ లాంచ్ అయింది. వివో టీ 4 5జి ( Vivo T4R ) పేరుతో కొత్త మొబైల్ తీసుకువచ్చారు. ఈ మొబైల్ ఫోన్ 6.77 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో ఫుల్ హెచ్డి ప్లస్ అమోలోడ్ డిస్ప్లే ( quad-curved AMOLED display)కూడా ఉంటుంది.

అలాగే ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 కూడా ఇందులో వర్క్ అవుతుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ 5700 mah బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ కొత్త మొబైల్ ఫోన్ లో 50 MP సోనీ ప్రధాన కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఇస్తున్నారు.

ఈ కొత్త మొబైల్ ఫోన్ రెండు కలర్స్ లో అంటే బ్లూ అలాగే సిల్వర్ లో మాత్రమే లభిస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ 19, 499 రూపాయలతో ప్రారంభం కానుంది. 23,499 వరకు ఈ మొబైల్ ఫోన్ లభిస్తుంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆన్లైన్ లో ఈ మొబైల్ ఫోన్ వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

Next Story