- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vivo: టీ4 సిరీస్‌లో కొత్త ఫోన్ విడుదల చేసిన వీవో
ముఖ్యంగా నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ ఇస్తామని కంపెనీ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వీవో భారత మార్కెట్లో తన టీ-సిరీస్ కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఆరో ఫోన్‌గా తెచ్చిన వీవో టీ4 ప్రో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 50 ఎంపీ కెమెరా, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఫన్‌టచ్ ఓఎస్15తో వచ్చే ఈ ఫోన్ 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ క్వాడ్ కర్వ్‌డ్ అమోల్డ్ డిస్‌పే, 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు కలిగి ఉంది. ముఖ్యంగా నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ ఇస్తామని కంపెనీ తెలిపింది. బ్లేజ్ గోల్డ్, నిట్రో బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్ లభిస్తుంది. మూడు వేరియంట్లలో విడుదల చేసిన ఈ ఫోన్ ధరలు 8జీబీ, 128జీబీ రూ. 27,999, 8జీబీ, 256జీబీ రూ. 29,999, 12జీబీ, 256జీబీ వేరియంట్ రూ. 31,999గా నిర్ణయించింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కస్టమర్లకు రూ. 3,000 వరకు డిస్కౌంట్ వర్తిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ బోనస్ కింద మరో రూ. 3,000 వరకు తగ్గింపు పొందే వీలుంటుంది. ఈ నెల 29 నుంచి వీవో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, ఇతర స్టోర్లలో అమ్మకాలు మొదలవుతాయని కంపెనీ వెల్లడించింది.






