- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Smartphones: ఆరు నెలల్లో 7 కోట్ల స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు
శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కారణంగా మెరుగైన అమ్మకాలతో 14.5 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ప్రథమార్థంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 7 కోట్లకు పైగా యూనిట్లను సరఫరా అయ్యాయి. ఇది గతేడాదితో పోలిస్తే స్వల్పంగా 1 శాతం మాత్రమే పెరిగిందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) సోమవారం ప్రకటనలో వెల్లడించింది. సమీక్షించిన కాలంలో మార్కెట్ లీడర్‌గా చైనాకు చెందిన వీవో బ్రాండ్ 23.5 శాతం వృద్ధితో అగ్రస్థానం సొంతం చేసుకుంది. కంపెనీ దేశీయంగా 19 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఇదే సమయంలో ప్రముఖ శాంసంగ్ బ్రాండ్ తన కొత్త ఏ,ఎం,ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కారణంగా మెరుగైన అమ్మకాలతో 14.5 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది కంటే 25.4 శాతం ఎక్కువ అమ్మకాలతో ఒప్పో 13.4 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది. ఇదివరకు మార్కెట్ లీడర్లుగా ఉన్న రియల్‌మీ, షావోమీ బ్రాండ్లు అమ్మకాల్లో క్షీణతను చూడటం గమనార్హం. మరో చైనా బ్రాండ్ వన్‌ప్లస్ సైతం 39.4 శాతం అమ్మకాల క్షీణత కారణంగా 2.5 శాతం మార్కెట్ వాటాతో 10వ స్థానంలో ఉంది. ప్రీమియం విభాగంలో శాంసంగ్‌ను అధిగమించినప్పటికీ, యాపిల్ మెరుగైన అమ్మకాలను చూసింది. గతేడాది కంటే 21.5 శాతం పెరిగి 2025 ప్రథమార్థంలో 59 లక్షల ఐఫోన్‌లను విక్రయించింది. అత్యధికంగా ఐఫోన్ 16 మోడల్ ఫోన్‌లు అమ్ముడయ్యాయి. సమీక్షించిన కాలంలో మొత్తం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సరఫరాలో ఐఫోన్ 16 4 శాతం వాటా కలిగి ఉంది. ఐఫోన్ 16 ప్లస్ రెండో అత్యధికంగా అమ్ముడైన మోడల్ అని ఐడీసీ వెల్లడించింది.






