Vishal Megamart IPO: డిసెంబర్ 11 నుంచి విశాల్ మెగామార్ట్ ఐపీఓ ప్రారంభం..!

by Maddikunta Saikiran |   (  Updated:2024-12-05 09:31:34  IST  )

గురుగ్రామ్(Gurgram) ప్రధాన కార్యాలయంగా దేశవ్యాప్తంగా దుస్తులు(Clothes), జనరల్ మర్చండైజ్(General Merchandise), ఎఫ్‌ఎంసీజీ(FMCG)లను విక్రయిస్తున్న సంస్థ విశాల్ మెగామార్ట్(Vishal Megamart) ఐపీఓ(IPO)కు వచ్చేందుకు రెడీ అయ్యింది.

Vishal Megamart IPO: డిసెంబర్ 11 నుంచి విశాల్ మెగామార్ట్ ఐపీఓ ప్రారంభం..!
X

దిశ,వెబ్‌‌డెస్క్: గురుగ్రామ్(Gurgram) ప్రధాన కార్యాలయంగా దేశవ్యాప్తంగా దుస్తులు(Clothes), జనరల్ మర్చండైజ్(General Merchandise), ఎఫ్‌ఎంసీజీ(FMCG)లను విక్రయిస్తున్న సంస్థ విశాల్ మెగామార్ట్(Vishal Megamart) ఐపీఓ(IPO)కు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఐపీఓ ద్వారా సుమారు రూ.8000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబధించి బిడ్డింగ్ ప్రక్రియ(Bidding Process) డిసెంబర్ 11 నుంచి 13 వరకు కొనసాగుతుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు(Anchor Investors)కు ఒక రోజు ముందే ఈ బిడ్డింగ్ విండో తెరుచుకోనుంది. ధరల శ్రేణి(Price Range), లాట్ సైజు(Lot size)లను కంపెనీ త్వరలో ప్రకటించనుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్(Offer For sale) రూపంలో షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులు పూర్తిగా వాటాదారుల(Shareholders)కే చేరనున్నాయి. ఇదిలా ఉంటే విశాల్ మెగా మార్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,911 కోట్ల ఆదాయం, రూ.461 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 2024 జూన్ నాటికి 626 స్టోర్లు ఉన్నాయి.

Next Story