- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JioHotstar: వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్న జియో
కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా అనవసరంగా ఉన్న ఉద్యోగాలను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: వయాకామ్18, వాల్ట్‌డిస్నీ ఇండియా విభాగానికి చెందిన జాయింట్ వెంచర్ 'జియోహాట్‌స్టార్' భారీ లేఆఫ్ ప్రక్రియ చేపడుతోంది. విలీనం నేపథ్యంలో జియోహాట్‌స్టార్ దాదాపు 1,100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా అనవసరంగా ఉన్న ఉద్యోగాలను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే తొలగింపులు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది జూన్ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ లేఆఫ్ ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్, కమర్షియల్, లీగల్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. వయాకామ్18, డిస్నీ స్టార్ ఇండియా విలీనంతో భారత్‌లోనే అతిపెద్ద మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థగా మారింది. కొత్త సంస్థ ఈ రంగంలో మరింత సమర్థవంతంగా అభివృద్ధి చెందేందుకు ప్రధాన స్పోర్ట్స్, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ విభాగాలపై దృష్టి సారించాలని భావిస్తోంది. రెండు పెద్ద సంస్థల విలీనం వల్ల కొన్ని ఉద్యోగాలపై ప్రభావం సహజం. ముఖ్యంగా పునర్నిర్మాణంలో భాగంగా ఒకే రకమైన ఉద్యోగాలను తగ్గించడం తప్పనిసరి అవుతుంది. తద్వారా జాయింట్ వెంచర్ కంపెనీ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు.






