Reciprocal Tariff: భారత్‌పై సుంకాలను 27 శాతం నుంచి 26 శాతానికి తగ్గించిన అమెరికా

by S Gopi |

భారత్‌పై సుంకాలను 27 శాతం నుంచి 26 శాతానికి సవరిస్తూ వైట్‌హౌస్ ప్రకటన విడుదల చేసింది.

Reciprocal Tariff: భారత్‌పై సుంకాలను 27 శాతం నుంచి 26 శాతానికి తగ్గించిన అమెరికా
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల చుట్టూ ఇంకా గందరగోళ ధోరణి కొనసాగుతూనే ఉంది. మొదట ట్రంప్ వైట్‌హౌస్ ప్రకటనలో చూపించిన బోర్డుపైన భారత్‌పై 26 శాతం విధిస్తున్నట్టు ఉంది. అదేరోజు సాయంత్రం అధికారిక పత్రాల్లో 27 శాతం అని ఉంది. దీంతో భారత్‌పై విధించే సుంకం చుట్టూ గందరగోళం ఏర్పడింది. దీన్ని పరిష్కరిస్తూ తాజాగా భారత్‌పై సుంకాలను 27 శాతం నుంచి 26 శాతానికి సవరిస్తూ వైట్‌హౌస్ ప్రకటన విడుదల చేసింది. చివరి నిమిషంలో అధికారిక పత్రాలను సరిద్దిన తర్వాత వైట్‌హౌస్ మార్పులు చేసినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఇన్ని పరిణామాల మధ్య భారతీయ అధికారులు ట్రంప్ సుంకం విధింపును 'ఎదురుదెబ్బ 'గా కాకుందా 'మిశ్రమ ప్రభావం'గా భావిస్తున్నారు. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య ఒప్పందంపై చర్చలను కొనసాగిస్తున్నారు. తాజా 1 శాతం సుంకం తగ్గింపు ద్వారా భారత్‌కు కలిగే అదనపు ప్రయోజనమేమీ ఉండదని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

Next Story