- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Indian Companies: భారతీయ కంపెనీలకు ఊరట
అమెరికా ట్రెజరీ విభాగానికి చెందిన 'ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్' (ఓఎఫ్ఏసీ) తమ అధికారిక 'బ్లాక్‌లిస్ట్'.. అంటే 'స్పెషల్ డిజగ్నేటెడ్ నేషనల్స్' (ఎస్‌డీఎన్) జాబితా నుండి ఈ నాలుగు భారతీయ కంపెనీల పేర్లను అధికారికంగా తొలగించినట్లు ప్రకటించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా సైన్యానికి, అక్కడి పరిశ్రమలకు అత్యాధునిక సాంకేతికత, కీలక పరికరాలను అక్రమంగా సరఫరా చేస్తున్నారంటూ గతంలో భారతీయ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా.. ఇప్పుడు అనూహ్యంగా వెనక్కి తగ్గింది. భారత దేశానికి చెందిన నాలుగు ప్రముఖ కంపెనీలపై విధించిన కఠిన ఆంక్షలను ఎత్తేస్తూ అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా ట్రెజరీ విభాగానికి చెందిన 'ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్' (ఓఎఫ్ఏసీ) తమ అధికారిక 'బ్లాక్‌లిస్ట్'.. అంటే 'స్పెషల్ డిజగ్నేటెడ్ నేషనల్స్' (ఎస్‌డీఎన్) జాబితా నుండి ఈ నాలుగు భారతీయ కంపెనీల పేర్లను అధికారికంగా తొలగించినట్లు ప్రకటించింది. గ్లోబల్ బిజినెస్ మార్కెట్లో ఈ సంస్థలు తిరిగి ఫ్రీగా లావాదేవీలు జరుపుకోవడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.
లిస్టులో హైదరాబాద్ కంపెనీలు
ఈ ఆంక్షల విముక్తి పొందిన వాటిలో మన హైదరాబాద్‌కు చెందిన 'ఆర్ఆర్‌జీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్', 'లోకేష్ మెషీన్స్ లిమిటెడ్' ఉండటం విశేషం. వీటితో పాటు అహ్మదాబాద్‌కు చెందిన 'గెలాక్సీ బేరింగ్స్', న్యూఢిల్లీకి చెందిన 'శౌర్య ఏరోనాటిక్స్' కంపెనీలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. అసలు వివాదం ఏంటంటే.. ఈ కంపెనీలపై రష్యాకు మిలిటరీ, సివిలియన్ రంగాల్లో ఉపయోగపడే పరికరాలను ఎగుమతి చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో న్యూఢిల్లీకి చెందిన 'శౌర్య ఏరోనాటిక్స్' రష్యాకు రాడార్, రేడియో నావిగేషనల్, రిమోట్ కంట్రోల్ ఉపకరణాలను పంపగా.. హైదరాబాద్‌కు చెందిన 'ఆర్ఆర్‌జీ ఇంజనీరింగ్' అమెరికా నిషేధించిన రష్యా కంపెనీ 'ఆర్టెక్స్'కు 100కు పైగా మైక్రోఎలక్ట్రానిక్స్ సరుకులను సరఫరా చేసింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో సంస్థ 'లోకేష్ మెషీన్స్' రష్యన్ తయారీ కంపెనీలకు డజన్ల కొద్దీ మెషిన్ టూల్స్ రవాణా చేయగా, అహ్మదాబాద్‌కు చెందిన 'గెలాక్సీ బేరింగ్స్' రోలర్ బేరింగ్‌లను ఎగుమతి చేసింది. తాజాగా అమెరికా ఈ ఆంక్షలను ఉపసంహరించుకోవడంతో ఈ కంపెనీల బిజినెస్ గండం పూర్తిగా దాటినట్లయింది.






