UPI: తమ్ముడు.. అకౌంట్‌లో డబ్బులు అవసరమే లేదు.. ఫోన్‌ పే, గూగుల్‌ పే నుంచి ఇలా పేమెంట్‌ చేయవచ్చు..!!

by Vennela |

UPI: అకౌంట్లో డబ్బులు లేకపోతే ట్రాన్సాక్షన్స్ చేయలేమన్న సంగతి తెలిసిందే కదా.

UPI: తమ్ముడు.. అకౌంట్‌లో డబ్బులు అవసరమే లేదు.. ఫోన్‌ పే, గూగుల్‌ పే నుంచి ఇలా పేమెంట్‌ చేయవచ్చు..!!
X

దిశ, వెబ్ డెస్క్: UPI: అకౌంట్లో డబ్బులు లేకపోతే ట్రాన్సాక్షన్స్ చేయలేమన్న సంగతి తెలిసిందే కదా. కానీ ఎన్పీసీఐ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ను ఉపయోగించుకుని గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేయవచ్చు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ గురించి మనం మరికొన్ని వివరాలు తెలుసుకుందాం.

ఇప్పుడంతా డిజిటల్ యుగమే నడుస్తోంది. ఏం కొనాలన్నా లిక్విడ్ క్యాష్ తో పనిలేదు. జస్ట్ డిజిటల్ మనీ..అంటే అకౌంట్లో ఉంటే డబ్బులు ఉంటే చాలు. దాన్ని డ్రా చేసి కొనాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది యూపీఐ ఉపయోగిస్తున్నారు. అంటే గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, బీమ్ యాప్స్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరొక కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయినా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. ఎన్పీసీఐ ఈ కొత్త సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది.

సాధారణంగా ప్రతి ఒక్కరి యూపీఐ ఐడీ వారి బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేసి ఉంటుంది. పేమెంట్స్ చేసినప్పుడు మీ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి. ఇప్పుడు ఎన్పీసీఐ ఒక అద్భుతమైన సేవను తీసుకువచ్చింది. మీ అకౌంట్లో డబ్బు లేకపోయినా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. యూపీఐ క్రెడిట్ సౌకర్యం క్రెడిట్ కార్డ్ వంటిది. అంటే ప్రతి కస్టమర్ కు ఒక నిర్దిష్టమైన లిమిట్ ఉంటుంది. మీ సౌకర్యం మీరు పొందాలని అనుకుంటే మీరు బ్యాంకుకు వెళ్లి యూపీఐ ఐడీకి క్రెడిట్ కావాలని దరఖాస్తు చేసుకోండి. దీనికి ముందు కచ్చితంగా ఈ కౌంట్ ను యూపీఐ ఐడీతో లింక్ అయి ఉండాలి.

బ్యాంక్ నుంచి ఆమోదం పొందిన తర్వాత మీ అకౌంట్లో డబ్బు ఉన్నా లేకపోయినా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. ఈ డబ్బును తిరిగి చెల్లించేందుకు 45 రోజుల గడువు ఉంటుంది. బ్యాంక్ ఎలాంటి వడ్డీ వసూలు చేయదు.45 రోజుల్లోపు మీ డబ్బు చెల్లించకపోతే వడ్డీ చెల్లించాలి. ప్రస్తుతం ఈ సేవ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రారంభం అయ్యింది. భీమ్, పేటీఎం, PayZapp, G Payలో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ సౌకర్యం వల్ల మరిన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని కేంద్రం ఆశిస్తోంది. ఇకపై ఏదైనా కొనుగోలు చేసే ముందు చింతించాల్సిన అవసరం ఉండదు. బ్యాంకులో డబ్బు లేకున్నా హాయిగా కొనుగోలు చేయవచ్చు.


Next Story