- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Digital Payments: వావ్.. ఫోన్ పే, జీపే యూజర్లకు బంపర్ న్యూస్.. ఇక డిస్కౌంట్లే మావ..!!
Digital Payments: ప్రస్తుత కాలంలో ఏ షాపింగ్ చేసినా సరే..డిజిటల్ ట్రాన్సాక్షన్ తోనే ఎక్కు మంది బిల్ పే చేస్తుండటం మనం గమనించవచ్చు.

దిశ, వెబ్ డెస్క్: Digital Payments: ప్రస్తుత కాలంలో ఏ షాపింగ్ చేసినా సరే..డిజిటల్ ట్రాన్సాక్షన్ తోనే ఎక్కు మంది బిల్ పే చేస్తుండటం మనం గమనించవచ్చు. క్రెడిట్ కార్డు లేదంటే యూపీఐ. ఈ రెండింట్లోనూ ఏదొకటి వాడేస్తున్నారు. అయితే యూపీఐ వినియోగాన్ని మరింత పెంచేందుకు భారత ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురాబోతోంది. అందేంటంటే షాపింగ్ లో క్రెడిట్ కార్డ్ కు బదులుగాయూపీఐతో పే చేస్తే మీకు తక్కువ ఖర్చు అవుతుంది. ఎవ్రీ డే షాపర్స్ కి యూపీఐ పేమెంట్స్ ని చౌకగా చేసే లక్ష్యంతో ఈ మార్పులకు ప్లాన్ చేస్తోంది. దీంతో మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఎక్కు మంది యూపీఐ వాడే అవకాశం ఉంటుంది.
మీరు క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లిస్తే వ్యాపారులు మర్చంట్ డిస్కౌంట్ రేట్ గా పేర్కొనే ఛార్జీ వర్తిస్తుంది. ఇది పర్చేజ్ అమౌంట్ లో దాదాపు 2 నుంచి 3శాతంగా ఉంటుంది. ఖర్చు చేసే ప్రతి రూ. 100కి వ్యాపారి బ్యాంకుకు రూ. 2 లేదా 3 చెల్లిస్తాడు. కొన్నిసార్లువ్యాపారులు ఈ ఖర్చును క్యాప్చర్ చేస్తుంటారు. వినియోగదారుల నుంచే వసూలు చేస్తుంటారు. దీనితో వస్తువుల ధర ఆటోమేటిగ్గా పెరుగుతుంది. అదే యూపీఐ పేమెంట్స్ కు అలాంటి ఛార్జీలు ఏవీ లేదు. వ్యాపారుల వద్ద డబ్బు ఉంటుంది. బ్యాంకులకు ఎలాంటి పేమెంట్స్ చేయరు. ఫైనాన్షియల్ ఫ్లాట్ఫామ్ లైవ్ మెంట్ రిపోర్టు ప్రకారం..వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సేవింగ్స్ ను నేరుగా దుకాణాదారులకు ట్రాన్స్ ఫర్ చేసే మార్గాలను అన్వేషిస్తోంది. ఈ స్కీమ్ విజయవంతం అవుతే యూపీఐని ఉపయోగించడం వల్ల చెక్ అవుట్లో తక్కువ పే చేస్తారు. ఉదాహరణకు క్రెడిట్ కార్డుతో రూ. 100 ఖరీదు చేసే వస్తువు యూపీఐతో రూ. 98 మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ ప్రయోజనాలు ఇన్ స్టంట్ గా లభిస్తాయి.
కొనుగోలు సమయంలో యూపీఐని ఉపయోగించినందుకు ప్రజలకు స్మాట్ డిస్కౌంట్ అందిస్తూ ప్రోత్సహించాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే అదనపు ఛార్జీలు లేవు. యూపీఐ మరింత ఆకట్టుకునే విధంగా మారుతుంది. ఈ ఆలోచనకు ఈ కామర్స్ కంపెనీలు, పేమెంట్ ప్రొవైడర్లు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక సేవల విభాగం, వినియోగదారుల హక్కుల సంఘాల వంటి కీలక వ్యవస్థలతో చర్చించాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ ప్రణాళికను ఖరారు చేయడానికి 2025జూన్ లో సమావేశం కానుంది.






