- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI: ఛార్జీలు విధిస్తే యూపీఐ వాడమంటున్న యూజర్లు
యూపీఐ వ్యవస్థ ప్రారంభమై ఆగష్టుతో 10 ఏళ్లు పూర్తవనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం దేశంలో యూపీఐ అందరికి అవసరమైన కీలక డిజిటల్ సాధనంగా ఉంది. అయితే, గత కొంతకాలంగా యూపీఐ వినియోగంపై ఛార్జీలు విధిస్తారనే ఊహాగానాలు పెరిగాయి. అలాంటిదేమీ ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసినప్పటికీ, కథనాలు కొనసాగుతూనే ఉన్నాయి. యూపీఐ వ్యవస్థ ప్రారంభమై ఆగష్టుతో 10 ఏళ్లు పూర్తవనుంది. ఈ సందర్భంగా దీని గురించి తాజాగా ప్రముఖ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో యూజర్లు పలు కీలక అంశాలను వెల్లడించారు. లావాదేవీలపై ఛార్జీలు ప్రవేశపెడితే యూపీఐ వాడటాన్నే మానేస్తామని దాదాపు నలుగురిలో ముగ్గురు యూజర్లు చెప్పారు. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండకూడదని 75 శాతం మంది స్పష్టం చేశారు. కేవలమ 25 శాతం మంది మాత్రమే అవసరానికి ఉపయోగిస్తామన్నారు. వీరిలో కూడా స్థిరమైన ఛార్జీలు ఉండాలని, ఇష్టమొచ్చిన విధంగా ఉండకూడదని ఎక్కువమంది చెప్పారు. 2025-26 నాటికి యూపీఐ ద్వారా రూ. 314 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. సంఖ్యా పరంగా ఇది 2,400 కోట్లకు పైనే యూపీఐ ప్లాట్‌ఫామ్ ప్రాసెస్ చేసింది. ఉచిత, సులభమైన లావాదేవీల వల్లే యూపీఐ వేగంగా విస్తరించింది. కానీ, ఛార్జీలు ప్రవేశపెడితే యూజర్ల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని సర్వే పేర్కొంది.






