- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI Transactions: 2,000 కోట్లు దాటిన యూపీఐ లావాదేవీలు
విలువ పరంగా గత నెలలో రూ. 24.85 లక్షల కోట్లు అయ్యాయని ఎన్‌పీసీఐ వెల్లడించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు గణనీయమైన వేగంగా పెరుగుతున్నాయి. రోజూవారీ జీవితంలో ప్రతి కొనుగోలుకు యూపీఐపైనే అందరూ ఆధాపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా యూపీఐ లావాదేవీలు కొత్త రికార్డులను సాధిస్తున్నాయి. తాజాగా ఆగష్టు నెలకు సంబంధించి 3 శాతం ఎక్కువగా 20 బిలియన్‌ల(2,001 కోట్ల) లావాదేవీలు నమోదయ్యాయి, విలువ పరంగా గత నెలలో రూ. 24.85 లక్షల కోట్లు అయ్యాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) సోమవారం అధికారిక గణాంకాల విడుదల సందర్భంగా వెల్లడించింది. అంతకుముందు జూలైలో 1,947 కోట్ల లావాదేవీలు జరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన లావాదేవీలకు ప్రధానంగా పండుగ సీజన్ డిమాండ్ కారణంగా నమోదయ్యాయి. ఎన్‌పీసీఐ ప్రకారం, విలువ పరంగా ఆగష్టులో యూపీఐ లావాదేవీలు 1 శాతం తగ్గాయి. ఆగస్టులో సగటున 64.5 కోట్ల రోజువారీ లావాదేవీలు జరగ్గా, విలువ పరంగా రోజుకు రూ. 80,177 కోట్లుగా ఉన్నాయి. యూపీఐ లావాదేవీలు వేగంగా పెరుగుతుండగా, ఐఎంపీఎస్ లావాదేవీలు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఆగష్టులో 2 శాతం తగ్గి 47.7 కోట్లకు చేరుకున్నాయి. ఈ లావాదేవీల విలువ కూడా 6 శాతం క్షీణతతో రూ. 5.98 లక్షల కోట్లకు చేరాయి. రోజువారీ ఐఎంపీఎస్ లావాదేవీలు 1.55 కోట్లతో 5 శాతం తగ్గాయి. ఇదే సమయంలో ఫాస్టాగ్ లావాదేవీలు 38.2 కోట్లతో 3 శాతం అధికంగా నమోదయ్యాయి. విలువ పరంగా 6 శాతం పెరిగి రూ. 7,053 కోట్లకు చేరాయి.






