- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI Transactions: ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి యూపీఐ లావాదేవీలు
2016, ఏప్రిల్‌లో యూపీఐ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నమోదైన అత్యధిక లావాదేవీల సంఖ్య, విలువ ఇవే కావడం విశేషం.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ చెల్లింపులు కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. తాజాగా మార్చి నెలకు సంబంధించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపులు ఏకంగా 10 శాతం పెరిగాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) బుధవారం గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం, మార్చి నెలలో మొత్తం యూపీఐ లావాదేవీలు రూ. 29.52 లక్షల కోట్లకు చేరగా, ఇది ఫిబ్రవరిలో జరిగిన రూ. 26.84 లక్షల కోట్ల కంటే 10 శాతం ఎక్కువ. ముఖ్యంగా డిమాండ్ పెరుగుదలతో పాటు అంతకుముందు ఫిబ్రవరిలో తక్కువ రోజుల కారణంగా వృద్ధి అత్యధికంగా నమోదైంది. విలువ పరంగానే కాకుండా సంఖ్యా పరంగా కూడా యూపీఐ లావాదేవీలు 11 శాతం పెరిగి 2,039 కోట్ల నుంచి 2,264 కోట్లకు చేరుకున్నాయి. 2016, ఏప్రిల్‌లో యూపీఐ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నమోదైన అత్యధిక లావాదేవీల సంఖ్య, విలువ ఇవే కావడం విశేషం. ఇక, మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లావాదేవీల విలువ 21 శాతం మేర పెరిగి, రూ. 314.23 లక్షల కోట్లకు చేరుకుంది. అదేవిధంగా, లావాదేవీల సంఖ్య కూడా 30 శాతం వృద్ధి చెంది, 24,161.6 కోట్లకు పెరిగాయి.






