UPI: రికార్డులు సృష్టించిన యూపీఐ లావాదేవీలు

by S Gopi |

డిసెంబర్ వరకు యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ. 230 లక్షల కోట్లకు చేరాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు.

UPI: రికార్డులు సృష్టించిన యూపీఐ లావాదేవీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ చెల్లింపులు అత్యంత వేగంగా ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ వరకు యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ. 230 లక్షల కోట్లకు చేరాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన.. యూపీఐ ఆధారిత లావాదేవీల విలువ చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. దేశీయ లావాదేవీల విషయానికొస్తే, 2025-26 సంవత్సరంలో డిసెంబర్ వరకు మొత్తం రూ. 230 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇది 2022-23లో జరిగిన మొత్తం రూ. 139 లక్షల కోట్ల లావాదేవీల విలువతో పోలిస్తే చాలా ఎక్కువని అన్నారు. యూపీఐ ఇప్పుడు భారత్‌కు వెలుపల కూడా విస్తరిస్తోందని, స్థానిక చట్టాలను అనుసరిస్తూనే ఎనిమిది దేశాలలో దీన్ని ఉపయోగిస్తున్నారు. మరో ప్రశ్నకు లిఖితపూర్వక స్మాధానమిచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అంతర్జాతీయ విస్తరణ కోసం ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) వివిధ చర్యలు తీసుకుంటున్నాయన్నారు. వాటిలో ఇతర దేశాల్లో పర్సన్ టూ పర్సన్ (పీ2పీ) చెల్లింపులను సులభతరం చేయడానికి భాగస్వామ్య దేశాలలోని ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌లతో యూపీఐ అనుసంధానం అయ్యే ప్రయత్నం చేస్తోంది. అలాగే పర్సన్ టూ మర్చంట్ (పీ2ఎం) చెల్లింపులను ప్రారంభించడానికి ప్రయాణ ఆధారిత కారిడార్లను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు.

Next Story