- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UPI: 42 శాతం పెరిగిన యూపీఐ చెల్లింపులు
2024, జూలై-డిసెంబర్ మధ్యకాలంలో జరిగిన మొత్తం 9,323 లావాదేవీల విలువ రూ. 130.19 లక్షల కోట్లకు చేరాయి

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ చెల్లింపుల ఆధిపత్యం కొనసాగుతోంది. 2024 ద్వితీయార్థంలో యూపీఐ చెల్లింపుల సంఖ్య ఏకంగా 42 శాతం పెరిగి 9,323 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయని ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ వరల్డ్‌లైన్ తెలిపింది. ఇండియా డిజిటల్ చెల్లింపులు-ద్వితీయార్థం-2024 పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలో సంఖ్యా పరంగానే కాకుండా విలువలోనూ యూపీఐ ప్లాట్‌ఫామ్‌లు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. 2024, డిసెంబర్‌లో ఈ మూడు ప్లాట్‌ఫామ్‌లు కలిసి మొత్తం లావాదేవీల్లో 93 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. విలువ పరంగా కూడా 92 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2024, జూలై-డిసెంబర్ మధ్యకాలంలో జరిగిన మొత్తం 9,323 లావాదేవీల విలువ రూ. 130.19 లక్షల కోట్లకు చేరాయి. ఇది అంతకుముందు ఏడాదిలో జరిగిన రూ. 99.68 లక్షల కోట్ల కంటే 31 శాతం పెరిగాయి. యూపీఐ కాకుండా డిజిటల్ చెల్లింపుల్లో క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, మొబైల్ చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్ ఉన్నాయి. యూపీఐ లావాదేవీల్లో పర్సన్-టు-పర్సన్(పీ2పీ) లావాదేవీలు 30 శాతం అధికంగా 3,521 కోట్ల లావాదేవీలు జరిగాయి. విలువ పరంగా 26 శాతం పెరిగాయి. పర్సన్-టు-మర్చంట్(పీ2ఎం) లావాదేవీల సంఖ్య 50 శాతం వృద్ధితో 5,803 కోట్ల లావాదేవీలు నమోదవగా, విలువ పరంగ 43 శాతం అధికంగా జరిగాయి. యూపీఐ వెసులుబాటు పెరగడం, మౌలిక సదుపాయాల విస్తరణ, మొబైల్ లావాదేవీలను ఎక్కువ మంది వాడుతుండటం కారణంగానే దేశంలో డిజిటల్ చెల్లింపులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది.






