- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UPI: యూపీఐ సేవల్లో అంతరాయం.. ఆ బ్యాంక్ కస్టమర్లకు తిప్పలు
ఇవాళ ఎస్ బీఐ యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు యూపీఐ, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (Internet Banking) సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం యూపీఐ (UPI) ద్వారా ఎస్‌బీఐ యూపీఐ ఖాతాలకు డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తుంటే సమస్య ఉత్పన్నమైంది. ఎస్‌బీఐ అన్ని యూపీఐ యాప్‌లలో సమస్య ఎదుర్కొంటోందనే వార్నింగ్ అలర్ట్ చూపించింది. దీంతో అనేక మంది యూజర్లు తమ యూపీఐ లావాదేవీలు జరగడం లేదంటూ (UPI to SBI not working) సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఓ నెటిజన్ల ఫిర్యాదులను గుర్తించిన నేషనల్ పేమేంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌లో స్పందిస్తూ ‘మీరు ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించిన స్క్రీన్ షార్ట్‌ను మాకు పంపించండి.. తదనుగుణంగా సహాయం చేస్తాం’ అని పేర్కొంది. మరో వైపు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ యాక్టివిటీ వల్ల 1 ఏప్రిల్ 2025న సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్య ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్ పేర్కొంది. ఈ సమయంలో యూపీఐ లైట్, ఎటీఎం సేవలు కొనసాగుతాయని పేర్కొంది. అయితే ఎస్‌బీఐ సాయంత్రం 4 గంటల నుంచి సేవలు అందుబాటులో ఉండవని చెప్పగా ఈ ఉదయం నుంచి యూపీఐ సేవలు పనిచేయకపోవడం వల్ల కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్ మెసేజ్ పంపించలేదని అంటున్నారు.






