- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Unclaimed Amount: ఆర్‌బీఐ నిధికి క్లెయిమ్ చేయని రూ. 60,518 కోట్లు
రూ. 60,518 కోట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ అయినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలియజేశారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి చివరి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా ఉన్న సొమ్ము రూ. 60,518 కోట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ అయినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలియజేశారు. అలాగే, ఫిబ్రవరి చివరి నాటికి బీమా సంస్థల వద్ద క్లెయిమ్ చేయని బీమా మొత్తం రూ. 8,973.89 కోట్లు, సెబీ నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్లలో క్లెయిమ్ చేయని మొత్తాల విలువ రూ. 3,749.34 కోట్లు ఉన్నాయని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ప్రభుత్వం, ఆర్థిక నియంత్రణ సంస్థలు క్లెయిమ్ చేయని వారిని సకాలంలో గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. దీనివల్ల ప్రస్తుతం క్లెయిమ్ చేయని డబ్బు మొత్తం తగ్గుతుంది. భవిష్యత్తులో ప్రజలు తమ సొమ్మును సులభంగా క్లెయిమ్ చేసుకోగలిగేలా, ఈ ప్రక్రియను సరళంగా, వేగంగా చేయడానికి కూడా కృషి చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.






