Ultra Cement: వైర్లు, కేబుల్స్ వ్యాపారంలోకి ఆల్ట్రాసిమెంట్

by S Gopi |

దీనికోసం రూ. 1,800 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసినట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది.

Ultra Cement: వైర్లు, కేబుల్స్ వ్యాపారంలోకి ఆల్ట్రాసిమెంట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఆల్ట్రా సిమెంట్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. వైర్లు, కేబుల్స్ వ్యాపారంలో ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, దీనికోసం రూ. 1,800 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసినట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది. వచ్చే రెండేళ్లలో ఈ నిధులను ఖర్చు చేయనుండగా, 2026, డిసెంబర్ నాటికి కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్టు స్పష్టం చేసింది. గుజరాత్‌లోని బరూచ్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. నిర్మాణ రంగంలోని తమ కస్టమర్లకు అన్ని రకాల సేవలను, ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతోనే వైర్లు, కేబుల్స్ విభాగంలోకి అడుగుపెడుతున్నాం. దీని ద్వారా నిర్మాణ రంగంలో సంస్థ ఉనికి మరింత విస్తరిస్తుందని భావిస్తున్నట్టు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా చెప్పారు. కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు కంపెనీ బోర్డు ఆమోదించిందని, పూర్తిస్థాయిలో బిల్డింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా సంస్థ మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్లనున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. 2019-2024 మధ్య దేశీయ వైర్లు, కేబుల్స్ పరిశ్రమ ఏటా 13 శాతం వృద్ధి సాధించింది.

Next Story