ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని అందిస్తున్న బ్యాంక్

by Disha Web Desk 17 |
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని అందిస్తున్న బ్యాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బ్యాంకులు క్రమంగా తమ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే మేజర్ బ్యాంకులు అన్ని కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు అదే దారిలో 'ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్' కూడా చేరింది. బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల కంటే అధికంగా వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.5% వరకు పెంచినట్లు బ్యాంకు పేర్కొంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కొత్త వడ్డీ రేట్లను తీసుకొచ్చింది.



75 వారాలు, 75 నెలలు, 990 రోజుల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.5% వడ్డీని ఆఫర్ చేస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 75 బేసిస్ పాయింట్లు అందిస్తుంది. 75 వారాల వ్యవధితో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ కింద రూ. ల‌క్ష FD చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 1,11,282 రాబడి ల‌భిస్తుంది. అదేవిధంగా సిటిజ‌న్లకు 8.25 శాతం వ‌డ్డీ ప్రకారం రూ. 1,12,466 పొందవచ్చు.

ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై కూడా వడ్డీ రేట్లను సంవత్సరానికి 7.7%కి పెంచింది. 990 రోజుల కాలానికి, సాధారణ డిపాజిట్‌పై 20 బేసిస్ పాయింట్లు అదనంగా లభిస్తుంది. ప్లాన్ కింద కనీసం రూ.15 లక్షల నుంచి రూ. 2 కోట్ల లోపు పెట్టుబడి పెట్టవచ్చు. Platina FD పథకంలో డబ్బును మధ్యలో విత్‌డ్రా చేయడానికి వీలుండదు.


Next Story

Most Viewed