- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు భారీ శుభవార్త: ఎలాంటి వడ్డీ లేకుండా రూ.3 లక్షల లోన్
దేశవ్యాప్తంగా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను తీసుకొచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను తీసుకొచ్చింది. అదే విధంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల నుండి పారిశ్రామికవేత్తలుగా మారాలనుకుంటున్న మహిళలకు కేంద్రం సబ్సిడీపై రుణాలను అందించే పథకాన్ని తెచ్చింది. అదే ‘ఉద్యోగిని’.
చిన్న తరహా పరిశ్రమలను స్థాపించి మహిళలు తమ కాళ్లపై సొంతంగా నిలబడాలనే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద రూ. 3 లక్షల వరకు రుణాలను అందిస్తారు. దీనిలో 30 శాతం రాయితీ ఉంటుంది.
ఈ స్కీమ్‌లో భాగంగా మొత్తం 88 చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చు. బేకరీ, కిరాణా దుకాణాలు, టైలరింగ్ షాపులు, అగరబత్తుల తయారీ, పాల డైరీ, గ్రంథాలయం, మట్టి పాత్రలు మొదలైనవి ఉన్నాయి. ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి ఈ పథకం వడ్డీ లేని రుణం అందిస్తుంది.
ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకునే వారి వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారుని కుటుంబ ఆదాయం రూ.1.5 లక్షల లోపు ఉండాలి. వికలాంగులు, వితంతువులకు ఎలాంటి ఆదాయ గరిష్ట పరిమితి లేదు. ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రముఖ బ్యాంకులు, పలు ఫైనాన్స్ సంస్థలలో అందుబాటులో ఉంది.
ఉద్యోగిని పథకానికి అవసరమైన పత్రాలు
* ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్‌బుక్ వివరాలు, ఫొటో.
- Tags
- Udyogini Scheme






