Uco Bank: ఎంసీఎల్‌ఆర్‌ తగ్గించిన యూకో బ్యాంక్‌

by S Gopi |

అంతేకాకుండా బ్యాంకు 10 ఏళ్ల ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీని పెంచినట్టు బుధవారం ప్రకటనలో తెలిపింది.

Uco Bank: ఎంసీఎల్‌ఆర్‌ తగ్గించిన యూకో బ్యాంక్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్‌ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 5 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించింది. దీంతో వివిధ వ్యవధులకు సంబంధించి రిటైల్, కార్పొరేట్ రుణాల కొత్త వడ్డీ రేట్లు 8.95 శాతం నుంచి 8.90 శాతంగా ఉంటాయి. అంతేకాకుండా బ్యాంకు 10 ఏళ్ల ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీని పెంచినట్టు బుధవారం ప్రకటనలో తెలిపింది. సవరించిన రేట్లు సెప్టెంబర్ 10 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. బ్యాంకు అధికారిక వివరాల ప్రకారం, ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలల కాలపరిమితులపై రుణాల రేట్లు ఐదు బేసిస్ పాయింట్లు తగ్గుతాయి. 10 ఏళ్ల ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ 6.51 శాతం నుంచి 6.78 శాతానికి పెరుగుతాయని వెల్లడించింది. యూకో బ్యాంకు నిర్ణయంతో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానంగా ఉన్న గృహ, వాహన, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లకు వర్తిస్తుంది.

Next Story