- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OPPO ప్రియులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తోన్న మరో రెండు మోడల్స్!
ఒప్పో నుండి ఇండియన్ మార్కెట్ లోకి మరో ఫోన్ రాబోతుంది. 0ppo find x9, oppo find x9 pro మోడళ్లను చైనాలో అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. మీడియా టెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ కలిగిఉన్న మొదటి స్మార్ట్ ఫోన్స్ లో ఇవి కూడా ఉండటంతో వీటి కోసం ఒప్పో లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఒప్పో నుండి ఇండియన్ మార్కెట్ లోకి మరో ఫోన్ రాబోతుంది. 0ppo find x9, oppo find x9 pro మోడళ్లను చైనాలో అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. మీడియా టెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ కలిగిఉన్న మొదటి స్మార్ట్ ఫోన్స్ లో ఇవి కూడా ఉండటంతో వీటి కోసం ఒప్పో లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 0ppo find x9, oppo find x9 pro లలో కొన్ని ముఖ్యమైన అప్ గ్రేడ్స్ ఉన్నాయి. 0ppo find x9 7,025mAh బ్యాటరీని కలిగి ఉండగా, oppo find x9 pro 7,500mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని డిస్ ప్లేను ColorOS 16 ఆధారంగా తయారు చేశారు.
అంతే కాకుండా ఈ మోడల్స్ లో కెమెరాపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. oppo find x9 proలో 200 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఉంది. 50 మెగా పిక్సల్ అల్ట్రావైడ్ మరియు 50 మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్ తో ఇది రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్ లో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఫీచర్లు ఉండబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ధర విషయానికి వస్తే Oppo Find X9 ధర ఇండియన్ మార్కెట్ లో రూ.69.999 నుండి ప్రారంభం కాబోతున్నట్టు టాక్ వినిపిస్తుండగా, Oppo Find X9 pro రూ.99,999లకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ రెండు మోడళ్లు డిసెంబర్ నెలలో ఇండియాలో విడుదల్లే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.






