Bank Scams: స్కామ్‌లకు బ్యాంకులే బాధ్యత వహించాలి

by S Gopi |

దేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు స్కామ్ బాధితులకు తమ సొమ్మును బ్యాంకులు రియంబర్స్ ద్వారా తిరిగి చెల్లించాలని ఆశిస్తున్నారు

Bank Scams: స్కామ్‌లకు బ్యాంకులే బాధ్యత వహించాలి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిజిటల్ వినియోగం పెరిగే కొద్దీ, సంబంధిత మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రముఖ గ్లోబల్ అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఫికో ఓ సర్వే నిర్వహించింది. రియల్-టైమ్ చెల్లింపులు, స్కామ్‌లు, స్కామ్‌లను ఎదుర్కోవడంతో బ్యాంకుల సామర్థ్యంపై ఫికో సంస్థ వివరాలను సేకరించింది. దీని ప్రకారం, దేశంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు(66 శాతం) బ్యాంకు ఖాతాదారులు స్కామ్ బాధితులకు తమ సొమ్మును బ్యాంకులు రియంబర్స్ ద్వారా తిరిగి చెల్లించాలని ఆశిస్తున్నారు. అలాగే, సగానికి పైగా కస్టమర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్కామ్‌ల నుంచి రక్షించేందుకు మెరుగైన స్కామ్ డిటెక్షన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతు అంటే 37 శాతం మంది కస్టమర్లు స్కామ్‌కు గురైతే బ్యాంకులే అందుకు జవాబుదారీగా ఉండాలని భావిస్తున్నారు. 57 శాతం మంది ఆర్థిక మోసాలను గుర్తించే మెరుగైన వ్యవస్థను బ్యాంకులు కలిగి ఉండాలని, 50 శాతం మంది స్కామ్‌ల గురించి ముందుగా హెచ్చరించాలని ఆశిస్తున్నారు. అయితే, స్కామ్‌లకు సంబంధించి మోసాలను నిరోధించేందుకు ఇప్పటికే బ్యాంకులు చేపడుతున్న చర్యల పట్ల 87 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఆర్థిక మోసాలను ఎదుర్కోవడంలో భారతీయ బ్యాంకులు ఎల్లప్పుడూ ముందుంటాయని ఎక్కువమంది బ్యాంకు ఖాతాదారులు అభిప్రాయం వ్యక్తం చేశారని ఫికో ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ దత్తు కొంపెల్లా పేర్కొన్నారు.

Next Story