TVS Motor: అక్టోబర్ నెలలో భారీగా పెరిగిన టీవీఎస్ మోటార్ వాహనాల విక్రయాలు

by Maddikunta Saikiran |

ప్రముఖ ద్విచక్ర వాహన(Two Wheeler) తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్(TVS Motor) అక్టోబర్ నెలలో వాహనాల అమ్మకాలు(Vehicles Sales)కు సంబంధించి నివేదికను ప్రకటించింది.

TVS Motor: అక్టోబర్ నెలలో భారీగా పెరిగిన టీవీఎస్ మోటార్ వాహనాల విక్రయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన(Two Wheeler) తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్(TVS Motor) అక్టోబర్ నెలలో వాహనాల అమ్మకాలు(Vehicles Sales)కు సంబంధించి నివేదికను ప్రకటించింది. గత నెలలో ఆ సంస్థకు చెందిన వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ నెలలో మొత్తం టీవీఎస్ వాహనాల అమ్మకాలు 4,89,015 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు ఒక నెలలో కంపెనీ ఇన్ని అమ్మకాలు జరపడం ఇదే మొదటి సారి. అయితే గతేడాది ఇదే సమయంలో ఆ సంస్థ మొత్తం 4,34,714 యూనిట్లను విక్రయించింది. పోయిన సంవత్సరం అక్టోబర్ నెలతో పోల్చుకుంటే ఈ సారి 13 శాతం వాహనాలు అత్యధికంగా అమ్ముడుపోయాయి. కాగా అక్టోబర్ లో విక్రయించిన వాహనాలలో ద్విచక్ర వాహనాల సంఖ్య 2,30,822 యూనిట్లగా ఉంది. ఇందులో మోటార్ సైకిల్(Motorcycle) అమ్మకాల సంఖ్య 2,30,822 కాగా, స్కూటర్ల(Scooters) విక్రయాలు 1,93,439 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే గత నెలలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) అమ్మకాలు 45 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అక్టోబర్ 2023లో ఈవీ అమ్మకాలు 20,153 యూనిట్ల నుండి అక్టోబర్ 2024 నాటికి 29,308 యూనిట్లకు పెరిగాయి. ఇక త్రీవీలర్ అమ్మకాలు(Three Wheeler Sales) 10,856 యూనిట్లుగా నమోదయ్యాయి.

Next Story