TVS Motor: ఆర్బిటర్ వీ1 కొత్త ఈవీ స్కూటర్ విడుదల చేసిన టీవీఎస్ మోటార్

by S Gopi |

బాస్ విధానంలో కాకుండా స్కూటర్ ధర రూ. 84,500(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది.

TVS Motor: ఆర్బిటర్ వీ1 కొత్త ఈవీ స్కూటర్ విడుదల చేసిన టీవీఎస్ మోటార్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూ-వీలర్ కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కొత్త ఆర్బిటర్ వీ1 వేరియంట్‌ను గురువారం విడుదల చేసింది. 1.8 కిలోవాట్ అవర్ బ్యాటరీతో నడిచే ఈ స్కూటర్‌ను బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్(బాస్) మోడల్ కింద తీసుకొచ్చింది. బాస్ మోడల్‌లో బ్యాటరీకి విడిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఆర్బిటర్ వీ1 ఈవీ స్కూటర్ ధర రూ. 49,999(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది. బాస్ విధానంలో కాకుండా స్కూటర్ ధర రూ. 84,500(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా బాస్ మోడల్‌ను కంపెనీ తన మొత్తం ఈవీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని స్కూటర్లకు అందిస్తామని తెలిపింది. దీని ద్వారా కస్టమర్లకు ముందస్తు ఖర్చు భారం తగ్గుతుందని, దీర్ఘకాలిక బ్యాటరీ హామీ లభిస్తుందని పేర్కొంది. బాస్ విధానంలో నెలకు రూ. 862 చెల్లించి బ్యాటరీ సర్వీసులను పొందవచ్చు. అలాగే, 5 ఏళ్లు లేదా 70 వేల కిలోమీటర్ల వరకు వారెంటీ లభిస్తుందని టీవీఎస్ మోటార్ వెల్లడించింది. ఇక, కొత్త టీవీఎస్ ఆర్బిటర్ వీ1 ఈవీ స్కూటర్ ఫుల్‌ఛార్జ్‌తో 86 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. బ్యాటరీ కేవలం 2 గంటల 20 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఈ స్కూటర్ ఈ స్కూటర్ కనెక్ట్ చేసిన మొబైల్ యాప్, వైజర్‌తో ఫ్రంట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇన్‌కమింగ్ కాల్ డిస్‌ప్లేతో కలర్డ్ ఎల్‌సీడీ క్లస్టర్, హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో డ్యూయల్ రైడ్ మోడ్‌లు (ఎకో, పవర్) సరికొత్త ఫీచర్లతో వస్తుంది.

Next Story