TVS Motor: ఐక్యూబ్ ఈవీలో కొత్త వెర్షన్ విడుదల చేసిన టీవీఎస్

by S Gopi |

పాత 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్‌కు బదులుగా వచ్చిన ఈ స్కూటర్ ధర రూ. 1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

TVS Motor: ఐక్యూబ్ ఈవీలో కొత్త వెర్షన్ విడుదల చేసిన టీవీఎస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ టీవీ మోటార్ కంపెనీ తన ఈవీ విభాగంలోని ఐక్యూబ్ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఐక్యూబ్ ఎశ్ పేరుతో 4.7 కిలోవాట్ అవర్ పెద్ద బ్యాటరీతో మెరుగైన పనితీరు అందిస్తుందని కంపెనీ తెలిపింది. పాత 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్‌కు బదులుగా వచ్చిన ఈ స్కూటర్ ధర రూ. 1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త వేరియంట్‌లో ప్రధానంగా 4.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ద్వారా ఒకే ఛార్జ్‌పై ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ స్కూటర్ ఐడీసీ ప్రమాణాల ప్రకారం ఒక ఫుల్‌ఛార్జ్‌తో 175 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 82 కి.మీ. కాగా, 0-40 కి.మీ. వేగాన్ని కేవలం 4.3 సెకన్లలో అందుకుంటుందని టీవీఎస్ మోటార్ వివరించింది. టెక్నాలజీ పరంగా కూడా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టీఎఫ్‌టీ డిస్‌ప్లే, నావిగేషన్, రైడ్ డేటా ట్రాకింగ్, నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, రివర్స్ మోడ్, క్రాష్ అలర్ట్, ఫాల్ అలర్ట్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు వినియోగదారులకు లభిస్తాయని కంపెనీ పేర్కొంది.

Next Story