Viral Video: భారత్ - పాక్ ఉద్రిక్తత వేళ మీ మొబైల్ ఫోన్లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే సురక్షితంగా ఉంటారు..ఎలాగంటే?

by Vennela |

Viral Video: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ కేంద్రప్రభుత్వం పౌరులను అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తోంది.

Turn on these settings on your mobile phone to stay safe during India-Pakistan tensions telugu news
X

Viral Video: భారత్ - పాక్ ఉద్రిక్తత వేళ మీ మొబైల్ ఫోన్లో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే సురక్షితంగా ఉంటారు..ఎలాగంటే?

దిశ, వెబ్ డెస్క్: Viral Video: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ కేంద్రప్రభుత్వం పౌరులను అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశమంతా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించింది. ముఖ్యంగా పౌరులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, దేశంలో విదేశీ శక్తులు ఏ క్షణాన ఎప్పుడు దాడి చేస్తాయో తెలియని పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో ఎలా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వం జారీచేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పౌరుల మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలారం వంటి సిగ్నల్స్ ద్వారా జాగ్రత్త పరుస్తుంది.

ముఖ్యంగా వైమానిక దాడులు జరిగే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అలర్ట్ పంపిస్తుంది. మీ ఫోన్లకు ఈ అలర్ట్ రావాలి అనుకున్నట్లయితే కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఎలా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ యూజర్స్ తమ ఫోన్లకు అలర్ట్స్ రావాలి అనుకున్నట్లయితే, సెట్టింగ్స్ లోకి వెళ్లి ఆ తర్వాత సేఫ్టీ అండ్ ఎమర్జన్సీ కేటగిరీలోకి వెళ్లాలి.

ఆ తర్వాత అందులోకి వెళ్లి వైర్ లెస్ అండ్ ఎమర్జన్సీ క్లిక్ చేసి ఆన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీరు అలర్ట్స్ పొందుతారు. ఇక యాపిల్ ఫోన్ యూజర్లు అలర్ట్స్ పొందాలంటే..సెట్టింగ్స్ ఓపెన్ చేశాక నోటిఫికేషన్స్ ఓపెన్ చేయాలి. అందులో టెస్ట్ అలర్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే అన్ని రకాల అలర్ట్స్ మీకు చేరతాయి. ఈ అలర్ట్స్ ను బట్టి మీరు స్పందించాల్సి ఉంటుంది.



Next Story