- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ ఎఫెక్ట్.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష పీఠం అలంకరించిన తరువాత అమెరికా తన ఆర్థిక సంక్షోభం నుండి బయట పడటానికి నూతన సుంకాల విధానాన్ని తీసుకువచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష పీఠం అలంకరించిన తరువాత అమెరికా తన ఆర్థిక సంక్షోభం నుండి బయట పడటానికి నూతన సుంకాల విధానాన్ని తీసుకువచ్చారు. అప్పటికే అమెరికా సమాఖ్య అప్పు 36 ట్రిలియన్ డాలర్లను దాటిపోయి, దాని అప్పు, జీడీపీ నిష్పత్తి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది.
‘విముక్తి దినం’ సుంకాలు
ఏప్రిల్ 2 న ‘విముక్తి దినం’ పేరిట నూతన సుంకాల విధానాన్ని ట్రంప్ ప్రవేశపెట్టారు. అమెరికా దిగుమతులపై 10 శాతం నుంచి 50 శాతం సుంకాన్ని 57 దేశాలకు పెంచారు. కెనడా, మెక్సికో లాంటి తమ మిత్రాదేశాలకు కూడా 25 శాతం సుంకం విధించారు. చైనాపై గరిష్టంగా 145 శాతం సుంకం ప్రకటించారు. ట్రంప్ దూకుడు ప్రకటనలతో వాణిజ్యం పునర్వ్యవస్తీకరణ ద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ చర్యలు దౌత్య సంబంధాలను దెబ్బతీశాయి. సరఫరా గొలుసులు దెబ్బ తిన్నాయి. ఆర్థిక మార్కెట్లను కుదిపివేశాయి. ట్రీలియన్ల విలువైన వస్తువులు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమలులోకి రావాల్సి ఉండగా, ఇండియా నుంచే కాకుండా అన్నీ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో చైనా మినహా అన్నీ దేశాలకు 90 రోజులపాటు ఎగుమతులు, దిగుమతులు నిలిపివేశారు. 10 శాతం బేస్ లైన్ సుంకం మాత్రం అమల్లో ఉంచారు.
ఇలా అమెరికా అధ్యక్షుడు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలంలోకి నెట్టి 47 రోజులైంది. చైనా నుంచి వచ్చే ఉత్పత్తుల పరస్పర సుంకాలు 20 శాతం నుంచి 104 శాతం దిగుమతి సుంకాల్ని ఎదుర్కొన్నది. వియత్నాం 46%, తైవాన్ 32%, ఇండియా 26%, దక్షిణ కొరియా25%,, జపాన్ 24% సుంకాలను ఎదుర్కొంటున్నాయి. ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, బ్రెజిల్ వంటి దేశాలు 10 శాతం బేస్ లైన్ సుంకాల్ని ఎదుర్కొన్నాయి. కొద్దికాలమే అయినా లేవలేకుండా పడిపోయాయి.
ఈ 47 రోజుల్లో ఏమి జరిగింది?
జూలైలో ముగింపు కాబోయే 90 రోజుల గడువు అనంతరం జరగబోయే విద్వంసాన్ని ఎలా ఎదుర్కోవాలో లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ వారం ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ (ఏపీఈసీ) వాణిజ్యం స్తబ్దతకు చేరుకుంటుందని హెచ్చరించింది. ఆపెక్ ప్రకారం ఎగుమతి వృద్ధి 5.7% నుంచి ఈ సంవత్సరం కేవలం 0.4 % కి పడిపోయింది. దిగుమతులు దాదాపు స్తిరంగా ఉన్నా, డిమాండ్ పడిపోయింది. పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోవటం వలన డిమాండ్ బలహీన పడటానికి కారణ మవుతుంది. ఇది ఉద్యోగాలపై, జీడీపీపై ప్రభావం చూపింది. 2025లో ప్రాంతీయ అభివృద్ధికి ఆపెక్ అంచనా 3.3% నుంచి 2.6 % కి పడిపోయింది. ఈ ఆస్తిరత పెద్ద, చిన్నా వ్యాపారాలను రెండింటినీ దెబ్బతీసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన వాల్ మార్ట్ సుంకాల ఖర్చుల మూలంగా ధరలను పెంచాల్సి వస్తుందని ప్రకటించగా , ట్రంప్ ఆన్ లైన్‌లో “వాల్ మార్ట్, చైనా లాంటివి సుంకాలను వారే భరించాలి. విలువైన కస్టమర్ల నుంచి ఏమి వసూలు చేయకూడదు.” అని తీవ్రంగా విమర్శించాడు.సుంకాల ప్రకటన ప్రారంభంలో S&P, గ్లోబెల్ మార్కెట్ 15% క్షీణించింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఎదురు గాలులు ఎదుర్కొంది. నిక్కి ఇండెక్స్, జపాన్ నిక్కి ఇండెక్స్ గణనీయమైన క్షీణతను చూసింది. 2.5 % తగ్గుదల సూచిస్తుంది. ఇది ప్రపంచ వాణిజ్య వ్యవస్థలపై వాటి సంబావన ప్రభావాన్ని సూచిస్తుంది. గ్లోబెల్ సర్వే ప్రకారం 2025, అమెరికా కొత్త వాణిజ్య యుద్ధం ప్రపంచ ఎగుమతి దారులు తీవ్రమైన అనిశ్ఛితిని ఎదుర్కొంటున్నారు.
కొత్త వ్యాపార దారులు వెతుకుతున్న ఎగుమతి దేశాలు
జర్మనీ, ఇటలీ, చైనా సంస్థలు ఖర్చు తగ్గింపు, వైవిధ్వికరణపై దృష్టి సారించే వ్యూహాలు రూపొందించుకొంటున్నాయి. అమెరికన్ సంస్థలు, లాటిన్ అమెరికా, వెస్ట్ యూరోపు దేశాల వైపు మొగ్గుచూపిస్తుండగా, చైనా కంపనీలు ఆసియా, పసిపిక్‌పై దృష్టి పెడుతున్నాయి. చాలా సంస్థలు ధరలు పెంచుతున్నాయి. చెల్లింపుల జప్యాలు పెరిగిపోతున్నాయి. సరఫరా దారులకు సుంకాల ఖర్చులు భరించేలా చేస్తున్నాయి. నష్ట భయాలు కొనసాగుతున్నాయి. అమెరికాలో కార్మికుల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. వేలాదిమంది ఫెడరల్ ఉద్యోగులు ఉద్యోగాల నుండి తొలగించబడ్డారు. కాంట్రాక్టర్లు కనీస వేతనాలు తగ్గించారు. ఉద్యోగులకు తక్కువ రక్షణలు, నిమాయకాల్లో ఎక్కువ అస్థిరలు ఉన్నాయి. అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వ్యాపార విశ్వాసాలు మరింత బలహీన పడ్డాయి.
నిరాశ జనకంగా భారత దేశ ఎగుమతి దారులు
భారత దేశం సున్నా సుంకాలతో అమెరికన్ వస్తువులను దిగుమతి చేసుకుంటుందని తమకు తెలిపిందని ట్రంపు ప్రకటించగా, అలాంటిదేమీ అనుకోలేదని, ఇంకా పరస్పర చర్చలు జరగాల్సి ఉందని ‘90 రోజుల విరామం లోపు’ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ, భారత సరుకుల ఉత్పత్తిదారుల్లో సుంకాలు లేకుండా దిగుమతయ్యే వస్తువులు భారత తయారీ వస్తువులకన్న చౌకగా వస్తే, తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ ప్రకటనల తరువాత సెన్సెక్స్ క్రష్ కావటం ఉత్పత్తి దారుల్లో భయాలను పెంచుతున్నది.
భారత దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తులు
ఆభరణాలు, ఎలక్ట్రిక్, విద్యుత్ పరికరాలు, ఔషదాలు, ఖనిజ సంపద, ఇంజనీరింగ్ వస్తువులు, రెడీ మేడ్ దుస్తులు, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు, వైద్య పరికరాలు, బియ్యం, జీడి పప్పు, సుగంద ద్రవ్యాలు, పండ్లు లాంటి వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. భారత దేశం దిగుమతి చేసుకొనే ఉత్పత్తులకు ఎక్కువగా సుంకాలు వసూలు చేస్తుందని ట్రంప్ బాహాటంగా ప్రకటిస్తున్నారు. అందుకే ముందుగా జీరో సుంకం అడుగుతున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారత దేశం రక్షణ వాదం యొక్క సుదీర్ఘ సంప్రదాయాన్ని కలిగి ఉంది. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, గృహ కార్మికులను రక్షించటం, ఉద్యోగాలు సృస్టించటం లక్ష్యంగా దేశాన్ని ఆర్థిక స్వావలంబన దిశగా నిర్దేశించారు. కొన్ని వస్తువులను దిగుమతికి అనుమతించలేదు. దేశ ఉత్పత్తుల ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని వాటికి తగిన సుంకాలు విధించారు.
భారత దేశంలో అతి పెద్ద దిగుమతి ఏమిటి?
చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, నూనెలు, ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, స్వేదనా ఉత్పత్తులు, నాణేలు, విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు. 2024లో అమెరికా, భారత దేశానికి అతిపెద్ద భాగస్వామి. దైపాక్షిక వాణిజ్యం 131.84 బిలియన్ల డాలర్లు. దీని ఫలితంగా భారత దేశానికి 41.18 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు లభించింది. వరుసగా నాలుగో సంవత్సరం కూడా అమెరికా భారత దేశానికి అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అన్నీ దిగుమతులపై బేస్ లైన్ 10 శాతం సుంకం పెద్ద వాణిజ్య మిగులు ఉన్న దేశాలకు గణనీయంగా ఎక్కువ రెట్లలో, భారత దేశం ఇప్పుడున్న ఉత్పత్తులపై 49 శాతం వరకు సుంకాలను ఎదుర్కొంటుంది. వాషింగ్టన్ తాజా చర్య రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు, వ్యవసాయ వంటి కీలకమైన భారతీయ పరిశ్రమలకు అంతరాయం కలిగించవచ్చు.
అమెరికా ఈ 47 రోజుల్లో తమ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, పన్నులు వేటిని పెంచవచ్చు, ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 70 ఏళ్ళు ఎలా పెంచాలి, 10 శాతం అమ్మకం పన్నులు పెంచాలా అనేదానిపై తల మునకలవుతున్నది. ఈ 90 రోజుల సుంకాల అమలు విరామం తరువాత జూలైలో ప్రకటించే సుంకాలు ఎలా ఉండబోతున్నాయోనని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి.






