- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pharma Sector: ఫార్మా రంగంపైనా టారిఫ్ తప్పదు: ట్రంప్ హెచ్చరిక
ప్రస్తుతం ఫార్మాతో పాటు సెమీకండక్టర్ రంగాల ఉత్పత్తులపై సుంకం గురించి చర్చలు జరుగుతున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనలో సమయంలో ఫార్మా, సెమీకండక్టర్, ఎనర్జీ సహా ఇంధన ఉత్పత్తులపై మినహాయింపు కల్పించినట్టు కథనాలు వచ్చాయి. ఈ కారణంతో గురువారం ట్రేడింగ్‌లో దేశీయ ఫార్మా షేర్లలో ర్యాలీ కనిపించింది. అయితే, ఆ తర్వాత ట్రంప్ ముఖ్యంగా ఫార్మా రంగంపై కూడా సుంకం ఉంటుందని, ఇప్పటివరకు చూడని స్థాయిలో వాటి ఉత్పత్తులపై టారిఫ్ విధించనున్నట్టు విలేకరులతో మాట్లాడిన సందర్భంలో చెప్పారు. ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులను ప్రత్యేక కేటగిరీగా చూస్తున్నాం. ప్రస్తుతం ఫార్మాతో పాటు సెమీకండక్టర్ రంగాల ఉత్పత్తులపై సుంకం గురించి చర్చలు జరుగుతున్నాయి, త్వరలో నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. ఎక్కువ సమయం తీసుకోమని, వీలైనంత త్వరగా ఫార్మా ఉత్పత్తులపై సుంకం గురించి ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలిపారు. గురువారం నాటి వైట్ హౌస్ ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం, అన్ని ఫార్మా దిగుమతులు పరస్పర సుంకాల నుంచి మినహాయించారు. ఫార్మాతో పాటు రాగి, సెమీకండక్టర్లు, కలప వస్తువులను కూడా మినహాయింపు ఇచ్చారు. కానీ, ఆ వెంటనే ట్రంప్ ఫార్మా ఉత్పత్తులపై ప్రకటనతో స్టాక్ మార్కెట్లలో ఫార్మా స్టాక్స్ భారీగా కుదేలయ్యాయి. ప్రధాన స్టాక్స్ అరబిందో ఫార్మా 6 శాతం, ఐపీసీఏ లేబొరేటరీస్ 6 శాతం, లుపిన్ 6 శాతం, బయోకాన్ 5.13 శాతం క్షీణించాయి. సిప్లా, దివీస్ లేబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా షేర్లు 3-5 శాతం వరకు పడిపోయాయి.






