- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump Trading: ట్రంప్ స్టాక్ ట్రేడింగ్‌పై కొత్త వివాదం
మొత్తంగా దాదాపు 100 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు కొనుగోలు, అమ్మకాలు జరిగినట్లు నివేదిక పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో మరోసారి చర్చనీయాంశమైంది. అసోసియేటెడ్ ప్రెస్ తాజా నివేదిక ప్రకారం, ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ట్రంప్ ఖాతాల్లో 3,600కుపైగా స్టాక్ మార్కెట్ లావాదేవీలు నమోదయ్యాయి. అంటే మార్కెట్లు తెరిచి ఉన్న ప్రతి రోజూ సగటున 50 ట్రేడింగ్‌లు జరిగాయి. మొత్తంగా దాదాపు 100 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు కొనుగోలు, అమ్మకాలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ ట్రేడింగ్ పరిమాణం, అలాగే ఆయన పెట్టుబడులు ఉన్న కంపెనీలు ప్రభుత్వ విధానాలతో నేరుగా సంబంధం కలిగి ఉండటం ఇప్పుడు రాజకీయ, నైతిక చర్చలకు దారితీస్తోంది. ట్రంప్ పోర్ట్‌ఫోలియోలో టెక్నాలజీ, రక్షణ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల షేర్లు ఉన్నట్లు ఫెడరల్ ఎథిక్స్ ఫైలింగ్ వెల్లడించింది. ముఖ్యంగా ఎన్విడియాలో ఆయనకు 6 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం. గతంలో చైనాకు అధునాతన చిప్‌ల విక్రయానికి ట్రంప్ ఆమోదం ఇవ్వడం, అదే సమయంలో ఎన్విడియా సీఈఓ ఆయనతో కలిసి చైనా పర్యటనకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే జాబితాలో యాపిల్, బోయింగ్, టెస్లా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. రక్షణ రంగంలోనూ ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ ఖాతాల్లో లాక్‌హెడ్ మార్టిన్, జనరల్ డైనమిక్, నాథ్రప్ గ్రమన్ షేర్లు కొనుగోలు చేసినట్లు నివేదిక వెల్లడించింది.






