- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump Tariffs: ఆటో పరిశ్రమపై ట్రంప్ 25శాతం సుంకాలు... ఇండియాలో కార్ల ధరలు పెరుగుతాయా?
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోకి దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై 25శాతం సుంకాన్ని ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోకి దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై 25శాతం సుంకాన్ని ప్రకటించారు. ఈ విధానం ఏప్రిల్ 2 నుండి అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ 3 నుండి ఫీజు వసూలు ప్రారంభమవుతుంది. ట్రంప్ చర్య ఆటోమొబైల్ పరిశ్రమకు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రభుత్వ చర్య అమెరికాలో తయారు చేయని అన్ని కార్లపై 25శాతం సుంకాన్ని విధిస్తుంది. ఇది శాశ్వత చర్య అవుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 2.5శాతం సుంకంతో ప్రారంభించి దానిని 25శాతానికి పెంచుతాము" అని ట్రంప్ ఒక విలేకరుల సమావేశంలో అన్నారు.
విదేశాల్లో తయారై అమెరికాకు దిగుమతయ్యే కార్లపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వచ్చే వారం ఈ చర్యలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇది శాశ్వతమైన చర్యగా పేర్కొన్న ట్రంప్ అమెరికాలో తయారయ్యే వాటిపై ఎలాంటి సుంకం ఉండదని పేర్కొన్నారు. ఈ చర్య అమెరికా ఆర్థిక వ్రుద్ధిని పెంచుతుందన్నారు. ట్రంప్ నిర్ణయంతో ఆటోమొబైల్ షేర్లు భారీగా తగ్గాయి. ప్రధానంగా జాగ్వార్ ల్యాంర్ రోవర్,మాత్రు సంస్థ అయిన టాటా మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 6.31శాతం తగ్గి రూ. 663 వద్ద కనిష్టాన్ని తాకాయి.
అమెరికాకు కార్లను సరఫరా చేసే అతిపెద్ద విదేశీ సరఫరాదారు మెక్సికో, తరువాత దక్షిణ కొరియా, జపాన్, కెనడా, జర్మనీ ఉన్నాయి. భారతదేశం నుండి అమెరికాకు ఆటోమొబైల్స్, ట్రక్కులు, మోటార్ సైకిళ్ళు ఎగుమతి అవుతాయి. భారతదేశం నుండి ఎగుమతి అయ్యే కార్లలో ఎక్కువ భాగం సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌లు. హ్యుందాయ్ వెర్నా సెడాన్, మారుతి బాలెనో హ్యాచ్‌బ్యాక్‌లు అత్యధికంగా ఎగుమతి అయ్యే భారతీయ కార్లు. వీటిని కొనాలంటే అమెరికన్ ప్రజలు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ చర్య అమెరికా ఆర్థిక వృద్ధిని పెంచుతుందని.. అభివృద్ధిని వేగవంతం చేస్తుందని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఏప్రిల్ 2 ను "విముక్తి దినోత్సవం"గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చర్య ఆటోమేకర్ల సరఫరా గొలుసును దెబ్బతీస్తుందని.. అమెరికన్ వినియోగదారులు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ చర్య అమెరికాలో విదేశీ కారు కొనడం ఖరీదైనదిగా మారుతుంది. ఈ చర్య వాహన ధరలు $4000.. $12000 మధ్య పెరగడానికి దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీని వలన అమెరికాకు దాదాపు $100 బిలియన్ల పన్ను వసూలు అవుతుందని అంచనా.
కాగా చైనా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌పై ఒప్పందం కుదుర్చుకోవడానికి చైనాకు స్వల్పమైన సుంకం మినహాయింపు ఇవ్వవచ్చని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అవసరమైతే, ఒప్పందం గడువును పొడిగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ట్రంప్ అన్నారు. టిక్‌టాక్ కొనడానికి అనేక మార్గాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. టిక్‌టాక్ పట్ల ఆసక్తి ఉందని కూడా వెల్లడించారు.






