- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRAI: టెలికాం ఆపరేటర్లపై ట్రాయ్ రూ.150 కోట్ల జరిమానా
ఈ జరిమానా 2020 నుంచి మూడు సంవత్సరాల కాలంలో జరిగిన వైఫల్యాలకు అనుగుణంగా విధించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం కంపెనీలపై నియంత్రణ సంస్థ ట్రాయ్ భారీ జరిమానా విధించింది. స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం ఆపరేటర్లపై రూ.150 కోట్ల జరిమానా విధించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ జరిమానా 2020 నుంచి మూడు సంవత్సరాల కాలంలో జరిగిన వైఫల్యాలకు అనుగుణంగా విధించింది. కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించ కుండానే నిలిపేయడం, నిబంధనల ప్రకారం స్పామర్ల టెలికాం కనెక్షన్లపై చర్యలు తీసుకోకపోవడం వంటి ఉల్లంఘనలకు కంపెనీలు పాల్పడ్డాయి. వినియోగదారులు స్పామ్ నంబర్ల గురించి ఫిర్యాదు చేసినప్పుడు కూడా, కంపెనీలు ఆ స్పామర్లపై చర్యలు తీసుకోలేదు, అంటే వారి ఫోన్ కనెక్షన్‌లను బ్లాక్ చేయడం లేదా డిస్‌కనెక్ట్ చేయడం వంటివి చేయలేదు. ముఖ్యంగా టెలికాం ఆపరేటర్లు సాధారణ 10-అంకెల మొబైల్ నంబర్‌లను ఉపయోగించే స్పామర్‌లపై సరైన చర్యలు తీసుకోవట్లేదని ట్రాయ్ గుర్తించింది. కాగా, గత సంవత్సరంలో ట్రాయ్ మొత్తం 21 లక్షలకు పైగా స్పామర్‌లను డిస్‌కనెక్ట్ చేసింది. లక్షకు పైగా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది.






