భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు షురూ.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

by Kema Shiva Kumar |

భారత్, అమెరికాల మధ్య మరోసారి వాణిజ్య చర్చలు ప్రారంభమవుతోన్న వేళ ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి.

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు షురూ.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, అమెరికాల మధ్య మరోసారి వాణిజ్య చర్చలు ప్రారంభమవుతోన్న వేళ ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. మరోవైపు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సంస్థ వడ్డీ రేట్లను రేపు ప్రకటించనున్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలుకు వెనుకాడుతున్నారు. మధ్యహ్నం 12.15 గంటల సమయంలో సెన్సెక్స్ 349 పాయింట్ల లాభంతో 82,135 వద్ద ఉండగా.. నిఫ్టీ 105 పాయింట్లు లాభపడి 25,174 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకము విలువ 88.05గా ఉంది. ఇక నిఫ్టీ సూచీలో హీరో మోటో‌కార్ప్, బజాజ్ ఫిన్‌సర్వ్, కొటక్‌ మహీంద్రా, లార్సెన్‌, అపోలో హాస్పిటల్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, టైటాన్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్‌, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

Next Story