Trade Deficit: 26 శాతం క్షీణించిన వాణిజ్య లోటు

by S Gopi |

దిగుమతులు 10.1 శాతం తగ్గి 61.6 బిలియన్ డాలర్ల(రూ. 5.43 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి.

Trade Deficit: 26 శాతం క్షీణించిన వాణిజ్య లోటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ ఎగుమతులు వరుసగా రెండో నెలా పుంజుకున్నాయి. సోమవారం ప్రభుత్వ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఆగష్టులో దేశ ఎగుమతులు 6.7 శాతం పెరిగి 35.1 బిలియన్ డాలర్ల(రూ. 3.09 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. అంతకుముందు జూలై నెలలో ఇవి 37.24 బిలియన్ డాలర్లు(రూ. 3.28 లక్షల కోట్లు) గా ఉన్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దిగుమతులు 10.1 శాతం తగ్గి 61.6 బిలియన్ డాలర్ల(రూ. 5.43 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. దీంతో ఆగస్టులో భారత వాణిజ్య లోటు 26.5 బిలియన్ డాలర్లు(రూ. 2.34 లక్షల కోట్లు)గా ఉందని, అంతకుముందు నెలలో ఇది 27.35 బిలియన్ డాలర్లు(రూ. 2.41 లక్షల కోట్లు)గా నమోదైంది. గతేడాది ఆగష్టులో నమోదైన వాణిజ్య లోటు 35.64 బిలియన్ డాలర్ల(రూ. 3.14 లక్షల కోట్ల)తో పోలిస్తే ఈసారి 25.7 శాతం క్షీణించింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న పాలసీ సవాళ్ల మధ్య భారత ఎగుమతులు మెరుగ్గా రాణించాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ అన్నారు.

Next Story