- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nirmala Sitharaman: త్వరలో యూఎస్,ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు ఖరారు: నిర్మలా సీతారామన్
యూకేతో చర్చలు పూర్తయ్యాయని, యూఎస్, యూరోపియన్ యూనియన్‌తో చర్చలు తుది దశకు చేరుకున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలో తుది ఒప్పందం పూర్తవనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం అన్నారు. 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే యూఏఈ, ఆస్ట్రేలియా, నాలుగు దేశాల ఈఎఫ్‌టీఏ(యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్) కూటమితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది. యూకేతో చర్చలు పూర్తయ్యాయని, యూఎస్, యూరోపియన్ యూనియన్‌తో చర్చలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ముగింపునకు వస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇప్పుడు మరిన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ముగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ట్రేడ్ కాన్‌క్లేవ్ ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు. దేశ ఎగుమతులకు సంబంధించి వస్తువులు, సేవల మొత్తం ఎగుమతులు 2024-24లో 825 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయని, గత సంవత్సరం కంటే ఇది 6 శాతం వృద్ధిని సాధించినట్టు వెల్లడించారు. ప్రపంచ ఎగుమతులు కేవలం 4 శాతం మాత్రమే పెరిగాయి, వాణిజ్య రంగంలో ప్రపంచ అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఎగుమతిదారులు వేగంగా, 6.3 శాతం వృద్ధిని సాధించడం విశేషమని అభిప్రాయపడ్డారు.
ఎగుమతిదారులకు హామీ
ఇదే సమయంలో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్.. వారందరికీ అన్ని రకాల మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎగుమతుల్లో కొత్త మార్కెట్లను కనుగొనడంపై దృష్టి పెట్టాలని వారిని కోరారు. ఇదే కార్యక్రమంలో ఆర్థిక సేవల కార్యదర్శి ఎం. నాగరాజు మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థికవ్యవస్థ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఫలితంగా ఏర్పడే ఎదురుగాలులతో ఇబ్బంది పడుతున్నప్పటికీ భారత వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, దేశం ఒక ఆశాకిరణంగా కొనసాగుతోందని తెలిపారు. ఔషధాలు, రత్నాభరణాల రంగాల నుంచి ఎగుమతులు స్థిరంగా ఉన్నాయని, ఆర్థిక మంత్రిత్వ శాఖ విధానాలు, పథకాలు, ఆర్థిక సహాయం ద్వారా మద్దతును అందించడానికి కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.






