- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Post Office Schemes: పెట్టుబడి తక్కువ..రిటర్న్స్ ఎక్కువ..ఈ పోస్టాఫీస్ స్కీమ్స్ తో బోలెడు బెనిఫిట్స్
Post Office Schemes: మనం కష్టపడి సంపాదించిన దానిలో కొంత భాగాన్ని తప్పకుండా పొదుపు చేసుకోవాలి.

దిశ, వెబ్ డెస్క్: Post Office Schemes: మనం కష్టపడి సంపాదించిన దానిలో కొంత భాగాన్ని తప్పకుండా పొదుపు చేసుకోవాలి. ఇలా పొదుపు చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. అలా చేయడం వల్ల భవిష్యత్తులో కొంత భరోసాను, బాసటను అందిస్తుంది. అత్యవసరాలను కూడా తీరుస్తుంది. ప్రతినెలా తమ ఆదాయంలో నుంచి చిన్నపాటి మొత్తాలను పొదుపు చేయాలని భావించేవారి ఎదుట ప్రస్తుతం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే అత్యధికులు కోరుకునేది మాత్రం తక్కువ రిస్క్ తో ఎక్కువ ప్రయోజనాన్ని అందించే పొదుపు పథకాలు. ఈ రకానికి చెందిన టాప్ పోస్టాఫీస్ పొదుపు పథకాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. పోస్టాఫీస్ పొదుపు ఖాతా
పోస్టాఫీస్ పొదుపు కాతాను ఎవరైనా తీసుకోవచ్చు. ఈ ఖాతాలో రూ. 500 కనీస బ్యాలెన్స్ ఉండాలి. ఇందులో జమ చేసే డబ్బుపై 4శాతం వరకు వడ్డీ వస్తుంది. ప్రతినెలా 10వ తేదీ నుంచి నెలాఖరు మధ్య ఉన్న అత్యల్ప నగదు బ్యాలెన్స్ ప్రాతిపదికన వడ్దీని లెక్కిస్తుంటారు. నెలలవారీ పొదుపు కోసం ఈ ఖాతా బాగా పనికొస్తుంది.
2. నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా
ప్రతినెలా కొంత మొత్తాన్ని తప్పుకుండా పొదుపు చేయాలని భావించేవారు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతాను పోస్టుఫీసులో తెరవచ్చు. ప్రతినెలా కనిష్టంగా రూ. 100 నుంచి పొదుపు చేయవచ్చు. గరిష్టంగా ప్రతినెలా ఎంత మొత్తం పొదుపు చేయవచ్చు అనేది దానికి ఎలాంటి పరిమితి ఉండదు. రాబోయే కొనేళ్లలో నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేయాలనే లక్ష్యం ఉన్నవారికి ఈ ఖాతా ఎంతో ఉపయోగపడుతుంది. ఖాతాలోని డబ్బుపై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని లెక్కించి జమ చేస్తారు. దీని వల్ల దీర్ఘకాలంలో వడ్డీ ఆదాయం బాగా లభిస్తుంది.
3. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్
నిర్దిష్టంగా కొనేళ్లు మాత్రమే డబ్బును పొదుపు చేయాలని భావించే వారికి బెస్ట్ ఆప్షన్ నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా. రూ. 1000 చెల్లించి ఈ అకౌంట్ పోస్టాఫీసులో తీసుకోవచ్చు. ఈ క్రమంలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల వ్యవధిలో ఏదొకదాన్ని ఎంపిక చేసుకోవాలి. మన అవసరాలు, ఆర్థిక సామర్థ్యాలకు సరిపోలే వ్యవధిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఈ ఖాతాలో జమయ్యే డబ్బుపై మంచి వడ్డీరేటు లభిస్తుంది. ఖాతా వ్యవధి ఎన్ని ఏళ్లు పెరిగితే వడ్డీరేటు అంతగా పెరుగుతుంది. వడ్డీపై ఏటా చక్రవడ్డీ లభించడం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది.
4. నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్ కమ్ అకౌంట్
తమ పొదుపుల నుంచి నెలలవారీ ఆదాయాన్ని కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్ నేషనల్ సేవింగ్స్ నెలలవారీ ఆదాయ ఖాతా. ఉద్యోగ విరమణ పొందినవారు ప్రతినెలా నిలకడైన ఆదాయాన్ని కోరుకునేవారు పోస్టాఫీసులో ఈ ఖాతాను తీసుకోవచ్చు. ఈ ఖాతాను ఒక వ్యక్తే తెరిస్తే గరిష్టంగా రూ. 9లక్షల దాకా డిపాజిట్ చేసుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉమ్మడి ఖాతాను తీసుకుంటే గరిష్టంగా రూ. 15లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ మొత్తంపై ప్రతినెలా వడ్డీ ఆదాయాన్ని అందిస్తారు.
5. సీనియర్ సిటిజన్ల పొదుపు పథకం
60ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగినవారు సీనియర్ సిటిజన్ పొదుపు పథకం పోస్టాఫీసులో తీసుకోవచ్చు. ఈ ఖాతాలో గరిష్టంగా రూ. 30లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇందులో జమ చేసే డబ్బుపై అత్యధిక వడ్డీరేటు లభిస్తుంది. మూడు నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తుంటారు. ఇంటి ఖర్చుల కోసం నిత్యం డబ్బులు అవసరమయ్యే వారికి ఈ ఖాతా చాలా ఉపయోగపడుతుంది.






