- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Business Ideas: లక్ష రూపాయలుంటే చాలు.. మీ జీవితం మారిపోయే బిజినెస్ ఐడియా ఉంది!
Business Ideas: మనలో చాలా మందికి వ్యాపారం(Business) చేయాలనే కోరిక ఉంటుంది.

దిశ,వెబ్‌డెస్క్: Business Ideas: మనలో చాలా మందికి వ్యాపారం(Business) చేయాలనే కోరిక ఉంటుంది. కానీ సరైనా ప్లాన్ లేక ముందుకు వెళ్లలేకపోతున్నారు. వ్యాపారం చేయాలంటే సరైనా ప్రణాళికతోపాటు సరైన పెట్టుబడి కూడా అవసరం. మీరు కూడా బిజినెస్(Business) ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తుంటే టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రతి వ్యాపారాని(Business)కి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు. తక్కువ డబ్బుతోనే అద్భుతమైన వ్యాపారాల(Business)ను ప్రారంభించవచ్చు. ఖర్చులను కూడా కంట్రోల్ చేయడం, స్మార్ట్ మార్కెటింగ్ టెక్నిక్స్ (Smart Marketing Techniques)ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. తక్కువ బడ్జెట్లో ప్రారంభించే టాప్ బిజినెస్ ఐడియా(Business Ideas)ల గురించి తెలుసుకుందాం.
బ్లాగింగ్, కంటెంట్ రైటింగ్:
మీకు రాయడం ఇష్టమైతే బ్లాగ్ స్టార్ట్ చేసి లేదా ఫ్రీలాన్స్ రైటర్ గా పనిచేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు. డొమైన్ రిజిస్ట్రేషన్, వెబ్ సైట్ హోస్టింగ్ కోసం రూ. 5000 నుంచి రూ. 10, 000 ఖర్చు చేయాలి. దీనికి రైటింగ్, ఎస్ఈవో , సోషల్ మీడియా ప్రమోషనల్ తెలిసుండాలి. యాడ్స్, స్పాన్సర్డ్ కంటెంట్, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా నెలకు రూ. 30వేలకు పైగా సంపాదించవచ్చు.
ట్యూషన్ లేదా ఆన్ లైన్ కోచింగ్ :
ఏదైనా సబ్జెక్టులో మంచి స్కిల్స్ ఉంటే చాలు విద్యార్థులకు ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో టీచ్ చేయవచ్చు. మార్కెటింగ్ , స్టడీ మెటీరియల్స్ కు రూ. 15,000 వరకు ఖర్చు అవుతుంది. జూమ్, గూగుల్ మీట్ లేదా యూట్యూబ్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు చెప్పవచ్చు. నెలకు రూ. 30వేలకు పైగా సంపాదించుకోవచ్చు.
టిఫిన్ సర్వీస్:
ఉద్యోగులు, విద్యార్థుల్లో చాలా మంది ఇంటి భోజనానికి ప్రాధాన్యం ఇస్తున్న రోజులివి. అందుకే హోం కుక్డ్ మీల్స్ కు డిమాండ్ భారీగా పెరిగింది. రూ. 50వేల లోపు పెట్టుబడితో టిఫిన్ సర్వీస్ స్టార్ చేసి నెలకు రూ. 60వేల వరకు సంపాదించుకోవచ్చు. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫుడ్ డెలివరీ యాప్స్ లో ప్రమోషన్ చేస్తే బాగుంటుంది.
ఫొటో గ్రఫీ బిజినెస్:
మంచి కెమెరా ఉండి, ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే ఫొటో గ్రఫీ బిజినెస్ ద్వారా చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు. రూ. 50వేల నుంచి రూ. లక్ష పెట్టుబడితో కెమెరా, లైటింగ్ వంటివి సమకూర్చుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా క్లయింట్స్ ను అట్రాక్ట్ చేయవచ్చు. ఒక్కో షూట్ కు రూ. 5వేల నుంచి 15వేల వరకు ఛార్జ్ చేస్తే నెలకు రూ. 50వేలకు పైగానే సంపాదించుకోవచ్చు.
మొబైల్ రిపేర్, యాక్సెసరీస్ బిజినెస్ :
మొబైల్ రిపేర్ అండ్ యాక్సెసరీస్ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉంది. ట్రైనింగ్, టూల్స్ కోసం రూ. 30వేల పెట్టుబడి పెట్టి, రిపేర్లు చేస్తూ యాక్సెసరీస్ అమ్మితే నెలకు రూ. 50వేలకు పైగా సంపాదించుకోవచ్చు.






