- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Wealth Creators: ఇతరులను ధనవంతులను చేసిన టాప్ 10 సంపద సృష్టికర్తలు
పబ్లిక్ షేర్ హోల్డర్ల కోసం సృష్టించిన సంపద ద్వారా భారతీయ వ్యాపార దిగ్గజాల మొట్టమొదటి ర్యాంకింగ్‌ను విడుదల చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వ్యాపార దిగ్గజాలు తమ కోసం దాచుకోవడానికి బదులుగా, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, రిటైల్ పెట్టుబడిదారులు, సంస్థల కోసం చాలా డబ్బును సృష్టించారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఓ సందర్భంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు ఇతరుల కోసం సృష్టించిన సంపద ఆధారంగా ర్యాంకులను ఇవ్వాలని అన్నారు. దీన్ని ప్రేరణగా ఎకనమిక్ టైమ్స్ ఓ నివేదికను రూపొందించింది. పబ్లిక్ షేర్ హోల్డర్ల కోసం సృష్టించిన సంపద ద్వారా భారతీయ వ్యాపార దిగ్గజాల మొట్టమొదటి ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. మరింత సులభంగా చెప్పాలంటే చాలావరకు సంపన్నుల జాబితా వారు సంపాదించే సంపద ఆధారంగా రిచ్ లిస్ట్ రూపొందిస్తారు. ఇతరుల కోసం వారు సృష్టించే సంపదను పరిగణలోకి తీసుకోరు. కానీ, అనేక కంపెనీల్లో వాటి యజమానుల కంటే ఎక్కువ సంపద వాటాదారులే వద్ద ఉంటుంది. ఉదాహరణకు జెఫ్ బెజోస్ ఆస్తి 260 బిలియన్ డాలర్లు ఉంటే, అమెజాన్ ఇన్వెస్టర్ల సంపద మాత్రం 2 ట్రిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది. ఈ విధంగా భారత్‌లోని ధనవంతులు ఎంత సంపదను సృష్టించారనే విషయాన్ని ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది.
ఈ జాబితాలో దేశీయ అతిపెద్ద గ్రూప్ టాటా గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 28.4 లక్షల కోట్లు ఉండగా, వాటాదారుల కోసం రూ. 13.9 లక్షల కోట్లను షృష్టించింది. టాటా తర్వాత రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్, బజాజ్ గ్రూప్, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ తర్వాతి 5 స్థానాల్లో నిలిచారు. వీరు మాత్రమే కాకుండా తమ వద్ద ఉన్న సంపదలో ఎక్కువ మొత్తం వాటాదారులకు కేటాయించిన వారు కూడా ఉన్నారు. మ్యాక్స్ గ్రూప్ ఫౌండర్ అనల్‌జిత్ సింగ్ తమ కంపెనీల విలువలో ఎక్కువ మొత్తం వాటాదారుల వద్దే ఉంచారు. కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.9 లక్షల కోట్లు ఉండగా, ఇన్వెస్టర్ల కోసం ఆయన రూ. 1.5 లక్షల కోట్లను సృష్టించారు. రెడ్డీ ల్యాబ్స్, టీవీఎస్ మోటార్స్, సిప్లా, మహీంద్రా లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి.






