Economy: ఇప్పుడే అమెరికా టారిఫ్ ప్రభావం అంచనా వేయడం తొందరపాటే

by S Gopi |

ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధి రేటు నెమ్మదిస్తుందనే సంకేతాలేమీ కనిపించడంలేదన్నారు.

Economy: ఇప్పుడే అమెరికా టారిఫ్ ప్రభావం అంచనా వేయడం తొందరపాటే
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకం ప్రకటించిన తర్వాత భారత ఆర్థికవ్యవస్థ పడే ప్రభావం గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ అన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. భారత జీడీపీ వృద్ధిపై సుంకాల ప్రభావాన్ని అంచనా వేయడం తొందరపాటు అవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి 6.3 శాతం నుంచి 6.8 శాతం వరకు ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధి రేటు నెమ్మదిస్తుందనే సంకేతాలేమీ కనిపించడంలేదన్నారు. రాజకీయ స్థిరత్వం, స్టాక్ మార్కెట్లో ఉన్న అవకాశాలు, శ్రామిక శక్తి, కొనసాగుతున్న వృద్ధి నేపథ్యంలో దేశం జీడీపీకి వచ్చిన ప్రమాదమేమీ లేదని, అంతకుముందు ఈ పరిస్థితులు తయారీ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉన్నాయని నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్ల రంగాల్లో భారత్ పోటీ పడాలని భావిస్తోందని, అందుకు తగిన చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో అమెరికా సుంకాల ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే విషయంపై స్పష్టతకు సమయం పడుతుంది. ఇతర ప్రధాన ఆర్థికవ్యవస్థల మాదిరిగానే, భారత్ కూడా తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా, ప్రస్తుతం భారత దిగుమతులపై అమెరికా 25 శాతం సుంకాన్ని అమలు చేస్తోంది. రష్యా చమురు కొనుటున్న కారణంగా డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకం మరో 25 శాతం ఆగష్టు 27 నుంచి వర్తించనుంది.

Next Story