- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tomato Rate: టొమాటో ధరలు దారుణంగా పడిపోయాయి. ఇలా ఐతే ఎలా
Tomato Rate: టొమాటో ధరలు భారీగా పడిపోయాయి. కొనుగోలుదారులకు ఇది సానుకూల అంశమే అయినప్పటీ రైతులకు మాత్రం బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

దిశ, వెబ్‌డెస్క్:Tomato Rate: టొమాటో ధరలు భారీగా పడిపోయాయి. కొనుగోలుదారులకు ఇది సానుకూల అంశమే అయినప్పటీ రైతులకు మాత్రం బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇంతకీ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం. రైతులకు అయితే టొమాటో పంటకు కిలోకు రూ. 5కూడా లభించడం లేదు. కొన్ని చోట్ల తమ పంటకు కిలో రూ. 2.5పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోస్తే కూలీ డబ్బులు కూడా రావడం లేదని బాధపడుతున్నారు. రిటైల్ మార్కెట్లో కిలో రూ. 10 నుంచి రూ. 15 వరకు కూరగాయలు విక్రయిస్తుండగా..రైతులకు కిలో రూ. 5కే లభిస్తోంది. తెలంగాణలో కొందరు వ్యాపారులు కేజీకి రూ. 2.5ఇవ్వడంతో కొందరు రైతులు తమ పంటను వదులుకుంటున్నారు.
టొమాటో పంట సాగు చేసిన రైతులు గత రెండు నెలలుగా గిట్టుబాటు ధర లేక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదరణ కరువవడంతో పంటను ఎలా పండించాలో ఏ మేరకు సాగు చేయాలనే దానిపై ఉద్యానవనశాఖ మార్గదర్శకాల లోపాన్ని ధరల పతనం మరోసారి బహిర్గతం చేస్తోంది. నెల రోజుల క్రితం పంటకు నిప్పంటించి వార్తల్లో నిలిచిన మరో రైతులు పంటను ఎప్పుడు సాగు చేయాలి..ఎప్పుడు వేయకూడదనే విషయంపై ఉద్యానవన శాఖ తమకు మార్గదర్శకంగా ఉండాలని కోరుతున్నారు. ఒక్కో ఎకరాకు రూ. 50వేల నుంచి రూ. 70వేలు ఖర్చు చేసినా పెట్టుబడి కూడా తిరిగి వస్తుందన్న ఆశ రైతులకు లేదని వాపోతున్నారు. వ్యాపారులు కిలోకు రూ. 2.5కే ఇవ్వడంతో కొందరు రైతులు తమ పంటను వదిలేశారు.
అయితే కొంతమంది రైతులు మాత్రం నేరుగా వినియోగదారులకు కిలో రూ. 8కే విక్రయిస్తున్నారు. వారం రోజుల క్రితం వరకు 25కేజీల బాక్సుకు రూ. 100 వచ్చేదని రైతులు చెబుతున్నారు. అయితే వ్యాపారులు ఆదివారం 25కిలోల బాక్సుకు రూ. 60మాత్రమే అందించడంతో మరికొందరు అన్నదాతలు పంటను వదులుకుంటున్నారు.






