- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rate ( 30-01-2025) : బంగారం ప్రియులకు షాక్.. నేడు మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
నేడు భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు. బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు. ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక కొత్త ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు.
కానీ, ఈ సారి కూడా వారికి నిరాశే ఎదురైంది. అయితే నిన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. నేడు భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.150 కు పెరిగి రూ.76,100 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.170 కు పెరిగి రూ.83,020 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,06,000 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.76,100
24 క్యారెట్ల బంగారం ధర - రూ.83,020
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.76,100
24 క్యారెట్ల బంగారం ధర – రూ.83,020






