- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Gold Rate ( 05-02- 2025) : బంగారం ప్రియులకు బిగ్ షాక్.. మరోసారి భారీగా పెరిగిన ధరలు..!
ఎన్నడూ లేని విధంగా రూ.86 వేలు దాటి అందర్ని షాక్ కి గురి చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు. బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు. ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.
ఇక ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు. కానీ, ఒక రోజు తగ్గినా ఇంకో రోజు అమాంతం పెరుగుతున్నాయి. ఇక, నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఎన్నడూ లేని విధంగా రూ.86 వేలు దాటి అందర్ని షాక్ కి గురి చేసింది. ముందు ముందు రూ. 1 లక్ష దాటడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 950 కు పెరిగి రూ.78,100 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,040 కు పెరిగి రూ.86,240 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,07,000 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.79,050
24 క్యారెట్ల బంగారం ధర - రూ.86,240
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.79,050
24 క్యారెట్ల బంగారం ధర – రూ.86,240






