Today Gold Rate ( 04-02- 2025) : నేడు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన బంగారం ధరలు.. వామ్మో తులం ధర ఎంతుందంటే?

by Phanindra |   (  Updated:2025-02-05 04:51:18  IST  )

ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు.

Today Gold Rate ( 04-02- 2025) : నేడు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన బంగారం ధరలు.. వామ్మో తులం ధర ఎంతుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు. బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు. ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

ఇక ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు. కానీ, ఒక రోజు తగ్గినా ఇంకో రోజు అమాంతం పెరుగుతున్నాయి. ఇక, నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1050 కు పెరిగి రూ.78,100 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,150 కు పెరిగి రూ.85,200 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,07,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.78,100

24 క్యారెట్ల బంగారం ధర - రూ.85,200

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.78,100

24 క్యారెట్ల బంగారం ధర – రూ.85,200

Next Story