నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-15 04:49:36  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఓ సారి లక్ష దాటి షాక్ ఇచ్చిన పసిడి ధరలు ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. కానీ మరోసారి నిన్న భారీగా రేట్లు పెరిగి మరోసారి లక్ష దాటింది. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,200 ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,680 గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ. 1,20,100కు చేరుకుంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.93,200

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,01,680

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.93,200

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,01,680

Next Story