Today Gold, Silver Rates: పసిడి ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్.. రెండో రోజు కూడా భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold, Silver Rates: పసిడి ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్.. రెండో రోజు కూడా  భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అలా గత కొన్ని రోజులుగా లక్ష మార్కును దాటిన పసిడి ధరలు సామాన్యులకు అందని ద్రాక్షగా మారాయి. అయితే వారం రోజులుగా పెరుగుతున్న ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని పసిడి ప్రియులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు వరుసగా రెండో రోజు అంటే నేడు కూడా ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,950 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.250 తగ్గి రూ.90,700గా ఉంది. అలాగే నిన్న రూ.99,220 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.270 తగ్గి నేడు రూ.98,950 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 తగ్గి కిలో రూ.1,18,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,700

24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,950

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,700

24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,950

Next Story