Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

by I. Sairam |   (  Updated:2026-01-02 05:34:36  IST  )

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు నిన్నటి నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ఇక సిల్వర్ విషయానికి వస్తే ఈ రోజు వెండి ధరలు కూడా పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,23,800 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1050 పెరిగి రూ.1,24,850 గా ఉంది. అలాగే నిన్న రూ.1,35,060 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1140 పెరిగి రూ.1,36,200కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.4000 పెరిగి కిలో రూ.2,60,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,24,850

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,36,200

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,24,850

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,36,200

Next Story