Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది.

Today Gold, Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగి బిగ్ షాకిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.87,100 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.2,200 పెరిగి రూ.89,300 ఉంది. అలాగే నిన్న రూ.95,020 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు రూ.2,400 పెరిగి రూ.97,420 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు రూ.3000 పెరిగి కిలో రూ. 1,11,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.89,300

24 క్యారెట్ల బంగారం ధర - రూ.97,420

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.89,300

24 క్యారెట్ల బంగారం ధర – రూ.97,420

Next Story